తెలంగాణ

telangana

ETV Bharat / sports

"వాళ్లొస్తే మా​దే ప్రపంచకప్​" - wirldcup

ఆసీస్​ క్రికెటర్లు వార్నర్, స్మిత్ ఏడాది బహిష్కరణ, అనంతరం జరిగిన సర్జరీలు ఆసీస్​ ప్రపంచకప్​ ఆశలపై చర్చకు తెరలేపాయి. ఈ నేపథ్యంలో వాళ్లొస్తే ప్రపంచకప్​లో సత్తా చాటుతారని షేన్​వార్న్ అభిప్రాయపడ్డాడు.

షేన్​వార్న్

By

Published : Mar 6, 2019, 1:07 PM IST

డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఆడితే ఆసీస్​ తిరిగి ప్రపంచకప్​ టైటిల్​ నిలబెట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. వారిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లని... రాబోయే టోర్నీలో సత్తా చాటుతారని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్​లో బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నారు వార్నర్, స్మిత్. ఫలితంగా, ఏడాది పాటు నిషేధానికి గురయ్యారీ కంగారూ ఆటగాళ్లు. వచ్చే నెలతో ఈ బహిష్కరణ పూర్తి కానుంది. ఇంగ్లండ్​లో జరిగే ప్రపంచకప్​కు అందుబాటులో ఉండే అవకాశముందని భావిస్తున్నారు.

ఫామ్​పై సందేహాలు...
ఇటీవలే ఇద్దరు ఆటగాళ్లకి మోచేతి శస్త్రచికిత్స జరిగింది. ఏడాది పాటు బహిష్కరణ, అనంతరం సర్జరీతో వారిరువురి ప్రపంచ కప్​ ప్రదర్శన సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఇంగ్లండ్​ పరిస్థితులకు అలవాటు పడతారో లేదో అనే సందిగ్ధత మొదలైంది.

ఈ విషయంపై షేన్ వార్న్ స్పందించాడు. 2003లో నిషేధిత మాదక ద్రవ్యాలు వాడి ఏడాది పాటు ఆటకు దూరమైనా... పురోగమనంలో సత్తా చాటానని గుర్తుచేశాడు వార్న్​. నూతనోత్సాహంతో అద్భుత ప్రదర్శన చేశానని తెలిపాడు. ఇదే విధంగా వార్నర్, స్మిత్ అత్యుత్తమంగా ఆడతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

వార్నర్, స్మిత్ రానున్న ఐపీఎల్​లో సత్తా చాటి ప్రపంచకప్​ కల్లా సిద్ధమవుతారని ఆస్ట్రేలియా సహాయక కోచ్​ రికీ పాంటింగ్ తెలిపాడు. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు నెట్స్​లో చెమటోడుస్తున్నారని చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details