తెలంగాణ

telangana

ETV Bharat / sports

'శామ్యూల్స్​కు మతిచెడింది.. సాయం చేయండి'

వెస్టిండీస్​ క్రికెటర్​ మార్లోన్​ శామ్యూల్స్​పై ఆస్ట్రేలియా దిగ్గజం షేన్​ వార్న్​ మండిపడ్డాడు. అతడికి మతి చెడిందని.. ఎవరైనా సాయం చేయాలంటూ ట్వీట్​ చేశాడు.

Shane wane
షేన్ వార్న్

By

Published : Oct 28, 2020, 9:24 PM IST

ఇంగ్లాండ్​ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌, అతని భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్​ మండిపడ్డాడు. అతడికి మతి చెడిందని.. ఎవరైనా సాయం అందించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసభ్యకరమైన ప్రవర్తనతో అతడు అందరిని దూరం చేసుకుని ఇబ్బంది పడుతున్నాడని ట్వీట్ చేశాడు.

ఎందుకన్నాడంటే?

ప్రస్తుత ఐపీఎల్​లో ఆలస్యంగా బరిలో దిగిన స్టోక్స్.. కరోనా ప్రొటోకాల్స్ ప్రకారం క్వారంటైన్ పూర్తి చేసుకున్నాకే మైదానంలోకి అడుగు పెట్టాడు. అయితే ఈ క్వారంటైన్ గురించి ఇటీవల మాట్లాడిన స్టోక్స్.. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని, తాను బద్ద శత్రువుగా భావించే శామ్యూల్స్​కు కూడా రావద్దని కోరుకుంటానని అన్నాడు. దీనికి వార్న్​ కూడా మద్దతు పలికాడు. దీనిపై స్పందించిన శామ్యూల్స్​.. స్టోక్స్​, అతడి భార్య, వార్న్​ను ఉద్దేశిస్తూ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు.

ఎవరైనా సాయం చేయండి

దీంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన శామ్యూల్స్​పై షేన్ వార్న్ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. శామ్యూల్స్ ఎవరి తోడు, స్నేహం లేక పిచ్చోడవుతున్నాడని, అతడికి ఎవరైనా సాయం చేయాలని ట్వీట్ చేశాడు.

"నాతో పాటు స్టోక్స్‌పై చేసిన వ్యాఖ్యలను ఇప్పుడే తిరిగి శామ్యూల్స్‌కు పంపించా. అతని వ్యాఖ్యలు సరైనవి కావు. ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగడం బాధాకరమైన విషయం. శామ్యూల్స్‌కు మతి చెడింది.. ఇప్పుడు అతనికి సహాయం అవసరం. కానీ దురదృష్టం కొద్దీ అతనికి స్నేహితులు ఎవరు లేరు.. కనీసం తోటి క్రికెటర్లు కూడా అతనికి సాయంగా రారు. ఎందుకంటే అతనొక సాధారణ క్రికెటర్‌. అందుకే నువ్వే ఎవరి వద్ద నుంచైనా వెంటనే సాయం కోరు" అంటూ మండిపడ్డాడు వార్న్​.

శామ్యూల్స్ సిగ్గుండాలి..

కాగా, శామ్యూల్స్ అనుచిత వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలని అంటున్నారు. అతడిని అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం స్టోక్స్‌ ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రాజస్థాన్​ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. షేన్‌ వార్న్‌ అదే జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంతకుముందు కూడా స్టోక్స్‌, వార్న్‌లతో శామ్యూల్స్‌కు విభేదాలు ఉన్నాయి.

ఇదీ చూడండి 'భారత్​లో మహిళా క్రికెట్​కు ఆదరణ పెరుగుతోంది'

ABOUT THE AUTHOR

...view details