ఆస్ట్రేలియాతో జరగబోయే మిగిలిన మూడు టెస్టులకు టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ అందుబాటులో ఉండటం సందేహంగా మారింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్ వేసిన బంతి అతడి చేతికి బలంగా తాకడం వల్ల గాయంతో విలవిలలాడాడు. తన చేతిని పైకి ఎత్తలేక పోయాడు. దీంతో బ్యాటింగ్ కొనసాగించలేక రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ అనంతరం అతడి గాయంపై స్పందించాడు సారథి విరాట్ కోహ్లీ.
"షమీ గాయంపై ఇప్పుడే ఏం చెప్పలేం. అతడిని స్కానింగ్ కోసం ఆస్పత్రిలో చేర్పించాం. అతడు మోచేతిని పైకి లేపలేకపోతున్నాడు. రాత్రి వరకు ఏం జరిగిందనేది తెలుస్తుంది."