భారత్ చారిత్రాత్మక డే/నైట్ టెస్టుకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత పేసర్ షమిపై.. వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి పిచ్‌పై అయినా, బంతి ఏదైనా షమితో డేంజర్ అని అన్నాడు.
"షమి.. రివర్స్ స్వింగ్, పేస్ బౌలింగ్ చక్కగా వేయగలడు. అంతే కాకుండా షమితో పాటు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ వంటి బౌలర్లు మా జట్టులో ఉన్నారు. కాబట్టి పింక్ బాల్ మ్యాచ్ పెద్ద విషయం కాదు."