టీమిండియా బౌలర్ మహ్మద్ షమి అరెస్టుపై బంగాల్లోని అలీపోరే న్యాయస్థానం స్టే విధించింది. దాదాపు రెండు నెలల పాటు స్టే ఉంటుందని ఆటగాడి తరఫు న్యాయవాది సలీం రెహ్మాన్ తెలిపారు.
" రెండు నెలలు షమి అరెస్టుపై కోర్టు స్టే విధించింది. కేసు తర్వాతి విచారణ నవంబర్ 2న జరుగుతుంది."
-- సలీం రెహ్మాన్, షమి తరఫు న్యాయవాది
గత ఏడాది మార్చిలో షమిపై గృహహింస కేసు పెట్టింది అతడి భార్య హసీన్ జహాన్. అప్పటి నుంచి షమి న్యాయస్థానం ముందు హాజరుకాలేదు. ఫలితంగా ఆగ్రహించిన కోర్టు అతడిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన అతడు.. అక్కడ నుంచి వచ్చిన 15 రోజుల లోపు లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది.