ప్రస్తుతం టెస్టు, టీ20లకు కెప్టెన్‌గా ఉన్నాడు షకిబుల్. నవంబర్ 3న బంగ్లాదేశ్-భారత్ మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ సిరీస్ కోసం నేడు (మంగళవారం) టీ20 జట్టును ప్రకటించనుంది బీసీబీ. టెస్టు జట్టును ప్రకటించడానికి మాత్రం మరికొంత సమయం కావాలని బీసీబీ అధికారి అక్రమ్ ఖాన్ తెలిపారు.
బంగ్లా క్రికెటర్ షకిబుల్‌పై ఐసీసీ నిషేధం..! - ICC ban for not reporting corrupt approach
బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబుల్‌పై ఐసీసీ నిషేధం విధించే అవకాశం ఉందని స్థానికి మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయమై ఐసీసీ మాత్రం స్పందించలేదు.
షకిబుల్
భారత పర్యటనకు ఆ దేశ స్టార్ క్రికెటర్ షకిబుల్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఐసీసీ ఆజ్ఞల మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అతడిని క్రికెట్ కార్యకలాపాలకు దూరంగా ఉంచింది. కనీసం ప్రాక్టీస్ చేయనీయడం లేదు. ఓ అవినీతి పరుడు అతడిని సంప్రదించిన విషయం ఐసీసీకి వెల్లడించలేదని ఓ పత్రిక ప్రచురించడమే ఇందుకు కారణం.
రెండేళ్ల క్రితం ఓ బుకీ షకిబుల్‌ను సంప్రదించాడని స్థానిక పత్రిక ఒకటి కథనం రాసింది. ఇదే నిజమైతే అవినీతి ఆరోపణలతో షకిబుల్ దాదాపు 18 నెలలు క్రికెట్‌కు దూరమయ్యే పరిస్థితి ఉంది. కానీ ఐసీసీ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.
ఇవీ చూడండి.. సంజయ్ మంజ్రేకర్‌పై ట్రోల్స్ వర్షం
Last Updated : Oct 29, 2019, 1:50 PM IST