షాహిద్ అఫ్రిది తొలి అంతర్జాతీయ సిరీస్‌ను గుర్తు చేసుకున్నాడు పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అజహర్ మహ్మద్. అందులోని ఓ మ్యాచ్‌లో సచిన్ బ్యాట్‌తో 36 బంతుల్లో సెంచరీ చేసిన విషయాన్ని వెల్లడించాడు.
సచిన్ బ్యాట్‌తో అఫ్రిది సెంచరీ చేసిన వేళ
అరంగేట్ర సిరీస్‌లోనే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో షాహిద్ అఫ్రిది ఆకట్టుకున్నాడని పాక్ మాజీ ఆల్‌రౌండర్ అజహర్ మహ్మద్ చెప్పాడు. అతడు ఆడిన రెండో మ్యాచ్‌లోనే కేవలం 37 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడని తెలిపాడు.
"1996లో సహారాకప్ తర్వాత నైరోబిలో సెంటెనరీ టోర్నీతో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు అఫ్రిది. అదే సిరీస్‌తో నేను అడుగుపెట్టాను. అందులో తొలుత ముస్తాక్ అహ్మద్ ఆడాల్సింది. కానీ గాయం కారణంగా అతడికి విశ్రాంతినిచ్చారు. ఆ సమయంలో అఫ్రిది, పాకిస్థాన్-ఏ జట్టుతో వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. దాంతో ముస్తాక్ స్థానాన్ని అఫ్రిదితో భర్తీ చేశారు. ఆ రోజుల్లో మూడులో ఆడే బ్యాట్స్‌మన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం. ఆ స్థానంలో అఫ్రిదిని, నన్ను, వసీంను ఆడమని చెప్పారు. ప్రాక్టీసులో స్పిన్నర్లను ఉతికి ఆరేశాడు ఆఫ్రిది.. లంకతో మ్యాచ్‌లోనూ అలాంటి ప్రదర్శనే ఇవ్వడం వల్ల మేం గెలిచాం. ఆరోజు సచిన్ ఇచ్చిన బ్యాట్‌తో కేవలం 37 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేశాడు అఫ్రిది. ఇకపై మూడో స్థానంలో అఫ్రిదిని ఆడించాలని అప్పుడే నిర్ణయించాం" -అజార్ మహమూద్, పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్
శ్రీలంక, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, కెన్యా జట్లు కలిసి 1996లో నైరోబీలో సెంటెనరీ టోర్నీలో పాల్గొన్నాయి. ఈ సిరీస్‌లో అఫ్రిది కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేయగా, 2014లో ఈ రికార్డును న్యూజిలాండ్‌కు చెందిన కోరీ అండర్సన్ (36 బంతుల్లో) అధిమగించాడు. ఆ తర్వాత 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై కేవలం 31 బంతుల్లోనే శతకం చేశాడు ఏబీ డివిలియర్స్.