భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌కు పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది కృతజ్ఞతలు తెలిపాడు. కరోనా వైరస్‌పై పాక్‌లో చేస్తున్న తన పోరాటానికి మద్దతు పలికినందుకు ధన్యవాదాలు చెప్పాడు. ప్రేమ, శాంతికి సరిహద్దులు ఉండవని చాటిచెప్పారని కొనియాడాడు.
"మద్దతు తెలిపిన నా సోదరులు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌కు ధన్యవాదాలు. మీ మద్దతు నాకు ఎంతో విలువైనది. మన మధ్య ఉన్న ఈ బంధం మానవత్వం, ప్రేమ, శాంతికి సరిహద్దులు ఉండవని చాటిచెబుతోంది. యువరాజ్ ఫౌండేషన్ యూవీకెన్‌కు అభినందనలు"