తెలంగాణ

telangana

ETV Bharat / sports

హారతి సన్నివేశం చూసి టీవీ పగలకొట్టా: అఫ్రిదీ - పాక్​ క్రికెట్ బోర్డు

పాకిస్థాన్​ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన ఇంట్లో హారతి సన్నివేశం రావడం చూసి టీవీ పగలకొట్టానంటూ కామెంట్ చేసిన అఫ్రిదీపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

Shahid Afridi
అఫ్రిదీ

By

Published : Dec 30, 2019, 11:21 AM IST

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. తన కూతురు హారతి సీన్​ను అనుకరించడం చూసిన ఈ మాజీ ఆటగాడు టీవీని పగలగొట్టాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అతడే స్వయంగా తెలిపాడు. దీనిపై ప్రస్తుతం భారతీయ క్రికెట్ అభిమానులు ట్రోల్స్​తో విరుచుకుపడుతున్నారు.

ఓ యాంకర్ మీరెప్పుడైనా టీవీని పగలకొట్టారా అని అడిగింది. దీనికి అఫ్రిదీ సమాధానమిస్తూ "అవును పగలకొట్టాను. ఓ ప్రైవేట్ ఛానెల్​లో అనేక ప్రోగ్రామ్స్​ వస్తుంటాయి. వాటిని ఒంటరిగా చూడమని నా భార్యకు చెప్పా. పిల్లలకు మాత్రం చూపించొద్దని కోరా. కాని ఓసారి టీవీలో హారతి సీన్​ వస్తోంటే దానిని నా కూతురు అనుకరిస్తూ కనిపించింది. వెంటనే టీవీని పగలకొట్టా" అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. పాకిస్థాన్ క్రికెట్​ ఆటగాళ్లు వివక్ష చూపించడంపై ఇటీవల షోయల్ అక్తర్, డానిష్ కనేరియా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వీడియో అందుకు సాక్ష్యంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవీ చూడండి.. గంగూలీని ట్రోల్ చేసిన కుమార్తె సనా

ABOUT THE AUTHOR

...view details