భారత్ నిర్వహించే టీ20 టోర్నీలో తమ దేశ ఆటగాళ్లకు చోటు లేకపోవడంపై పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచ స్థాయి పోటీ క్రికెట్‌కు వేదిక అయిన ఆ లీగ్‌లో తమ ఆటగాళ్లు ఆడకపోవడం వల్ల నష్టపోతున్నామని వాపోయాడు.
"భారత్ నిర్వహించే టీ20 టోర్నీకి ఎంతో బ్రాండ్ ఉంది. బాబర్ అజామ్, ఇతర పాక్ క్రికెటర్లు ఆ లీగ్‌లో ఆడితే ఒత్తిడిలో రాణించడానికి అలవాటు పడతారు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత విధానాల వల్ల అతి పెద్ద క్రికెట్ వేదికలో మా ఆటగాళ్లు చోటు కోల్పోతున్నారు" -పాకిస్థాన్ మీడియాతో అఫ్రిది
భారత్ నిర్వహించే లీగ్‌లో ఆడే అవకాశం లేకపోయినా, ప్రపంచ లీగుల్లో తమ ఆటగాళ్లకు డిమాండ్ ఉందని అఫ్రిది అన్నాడు.
"ప్రపంచవ్యాప్తంగా ఇతర లీగుల్లో మా ఆటగాళ్లకు డిమాండ్ ఉంది. అంతేకాక మా దేశంలోనే టాప్ లీగ్ ఉంది. ప్రతిభను పెంచుకోవడానికి, ప్రదర్శించడానికి, అగ్రశ్రేణి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌లో అనుభవాలు పంచుకోవడానికి పాకిస్థాన్ సూపర్ లీగ్ వేదికగా ఉంది" -అఫ్రిది
తన కెరీర్‌లో భారత్ అభిమానుల నుంచి ఎంతో ఆదరణ పొందానని అఫ్రిది పేర్కొన్నాడు. భారత్‌లో క్రికెట్ ఆడటాన్ని ఎంతో ఆస్వాదించానని, వాళ్లు చూపించే ప్రేమ, గౌరవాన్ని ఎప్పుడూ అభినందిస్తుంటాని తెలిపాడు. సామాజిక వేదికల్లో ఇండియా నుంచి కూడా సందేశాలు వస్తుంటాయి. వాటిలో ఎంతోమందికి బదులిచ్చాను వివరణ ఇచ్చాడు. 2008 సీజన్ తర్వాత నుంచి పాక్ క్రికెటర్లు భారత్ లీగ్‌లో ఆడటం లేదు.