రికీ పాంటింగ్.. ఆస్ట్రేలియాను విజయపథంలో నడిపి జట్టుకు ప్రపంచకప్ అందించిన సారథి. మహేంద్ర సింగ్ ధోనీ.. టీమ్ఇండియా అత్యద్భుతమ సారథుల్లో ఒకరు. వీరిద్దరిలో గొప్ప ఉత్తమ కెప్టెన్ ఎవరంటే చెప్పడం కాస్త కష్టమే. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మాత్రం వీరిద్దరిలో ప్రతిభగల కెప్టెన్ ఎవరనే విషయంపై స్పందించాడు. ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'పాంటింగ్, ధోనీల్లో ఉత్తమ కెప్టెన్ ఎవరంటే!' - ధోనీ గురించి షాహిద్ అఫ్రిదీ
ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ. పాంటింగ్, ధోనీల్లో ఉత్తమ కెప్టెన్ ఎవరని అడగ్గా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

పాంటింగ్, ధోనీల్లో ఎవరు ఉత్తమ కెప్టెనంటే!
ఓ అభిమాని ధోనీ, పాంటింగ్.. వీరిద్దరిలో ఎవరు గొప్ప కెప్టెన్ అని అడగ్గా.. "నేను ధోనీని ఎంచుకుంటా. ఎందుకంటే అతడు యువ క్రికెటర్లతో కూడిన ఓ కొత్త జట్టును తయారు చేశాడు" అంటూ చెప్పుకొచ్చాడు.
ధోనీ కెరీర్లో ఎంతో మంది యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చాడు. అందులో ప్రస్తుత టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ ఉన్నారు. అలాగే భారత జట్టుకు 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు.