పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ ఇంట్లో మరోసారి సందడి నెలకొంది. తన భార్య నదియ శుక్రవారం (ఫిబ్రవరి 14న) ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముస్లింలు పవిత్రంగా భావించే శక్రవారం రోజునే పాప పుట్టడం వల్ల అఫ్రీదీ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. తాను తండ్రయిన విషయాన్ని అఫ్రీదీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. పాపను ఎత్తుకున్న ఫొటోను కూడా పోస్ట్ చేసి తన సంతోషాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. అయితే గతంలోనూ ఇతడికి పుట్టిన నలుగురు ఆడబిడ్డలే కావడం విశేషం.
ప్రేమికుల రోజున ఐదోసారి తండ్రైన అఫ్రీదీ
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ మరోసారి తండ్రయ్యాడు. ఫిబ్రవరి 14 రాత్రి తన భార్య నదియ ఐదోసారి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతకుముందు నలుగురూ అమ్మాయిలే కావడం విశేషం.
తన పిల్లలకు ఆంక్షలు పెడుతుంటాడని అఫ్రీదీపై చాలా వార్తలు వినిపించాయి. గతంలో తన కూతురు టీవీలో చూసి హారతి సీన్‌ను అనుకరించడం చూసిన అఫ్రీదీ.. టీవీ పగలకొట్టినట్లు చెప్పడం అప్పట్లో పెద్ద దుమారం లేచింది. గతేడాది 'గేమ్ ఛేంజర్' పేరుతో తన ఆత్మకథను పుస్తకం రూపంలో విడుదల చేశాడు. ఇందులో పొందుపర్చిన పలు అంశాలు వివాదాస్పదమయ్యాయి. మొత్తం 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడిన అఫ్రీదీ... 2016 ఏప్రిల్‌లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం టీ20 లీగ్‌ల్లో మాత్రమే ఆడుతున్నాడు.