భారత యువ ఓపెనర్ షెఫాలీ వర్మపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రశంసల జల్లు కురిపించింది. ఇతరుల ఒత్తిడిని షెఫాలీ తొలగిస్తుందని, ఎల్లప్పుడూ జట్టు కోసం ఆడేందుకు ప్రయత్నిస్తుందని చెప్పింది.
"షెఫాలీ అద్భుతమైన ప్లేయర్. జట్టుకు ఆమె ఓ పాజిటివ్ ఎనర్జీ. తనతో బ్యాటింగ్ చేసేటప్పుడు మనల్ని ప్రోత్సహిస్తుంది. మనపై ఉన్న ఒత్తిడిని తొలగిస్తుంది. అలాంటి ప్లేయర్ ఉండాలని ప్రతి జట్టు కోరుకుంటుంది. దేశం కోసం ఆడాలనుకునేవారు ఉత్తమ ప్రదర్శన చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. జట్టు కోసం పోరాడటాన్ని షెఫాలీ ఎంతో ఆస్వాదిస్తుంది"
- హర్మన్‌ప్రీత్ కౌర్, టీమిండియా మహిళా జట్టు కెప్టెన్
షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ అదే విధంగా వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టి సారించాలని కౌర్ అభిప్రాయపడింది.
"మేం ఎంతో కాలంగా కలిసి ఆడుతున్నాం. ఇతరుల దగ్గర నుంచి క్రికెట్ సలహాలు తీసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. అందుకే జట్టుగా రాణిస్తున్నాం. అయితే వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనలు చేయడానికి ప్రయత్నించాలి. నేను ఈ టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాను. అయినా జట్టు అద్భుతంగా ఆడుతోంది. దాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా. గత సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయాక, సమష్టిగా సత్తా చాటాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఇప్పుడు విజయాలు సాధిస్తున్నాం. మేం కేవలం ఒకటి లేదా ఇద్దరు ఆటగాళ్లపై ఆధారపడట్లేదు. గతం గురించి కాకుండా ప్రస్తుతం గురించే ఆలోచిస్తున్నాం. జట్టుగా మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నా"
- హర్మన్‌ప్రీత్ కౌర్,టీమిండియా మహిళా జట్టు కెప్టెన్
సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో గురువారం.. భారత్ సెమీఫైనల్ ఆడనుంది. 2018లో ఇంగ్లండ్‌తోనే సెమీస్‌లో తలపడగా టీమిండియా ఓటమి పాలైంది.
ఇదీ చూడండి.. టీ20 ప్రపంచకప్: వరుణుడు కరుణిస్తే భారత్ ఫైనల్‌కే!