తెలంగాణ

telangana

ETV Bharat / sports

వెండితెరపై​ శభాష్​ 'మిథాలీ'​​... నటి ఎవరో తెలుసా..? - Shabaash Mithu movie: women team india captain mithali raj biopic details revealed shared on cricketers birthday

భారత మహిళా జట్టు కెప్టెన్​ మిథాలీరాజ్ బయోపిక్.. త్వరలో​ వెండితెరపై కనువిందు చేయనుంది. ఈ సినిమాకు 'శభాష్​ మిథు' అనే టైటిల్​ పెట్టింది చిత్రబృందం. నేడు మిథాలీ 37వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Shabaash Mithu
వెండితెరపై​ మిథాలీ రాజ్​​... నటి ఎవరో తెలుసా..?

By

Published : Dec 3, 2019, 1:19 PM IST

Updated : Dec 3, 2019, 1:26 PM IST

బయోపిక్​ల ట్రెండ్​ను బాగా ఫాలో అవుతున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా, విద్య రంగాల్లోని ప్రముఖుల జీవితగాథలను వెండితెరకు ఎక్కించారు. త్వరలో భారత క్రికెట్​లో దిగ్గజ క్రీడాకారిణి మిథాలీరాజ్​... బయోపిక్​ కూడా తెరకెక్కనుంది. దీనిపై నేడు అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్రబృందం. 'శభాష్​ మిథు' టైటిల్ ఖరారు చేసినట్లు వెల్లడించింది.

శభాష్​ మిథుగా తాప్సీ...

నేడు మిథాలీ 37వ జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర విశేషాలను వెల్లడించింది నటి తాప్సీ. సినిమాలో మిథాలీ పాత్రలో తాను కనిపించనున్నట్లు ఆమె స్వయంగా చెప్పింది. ఈ స్టార్​ ప్లేయర్​ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిందీ అందాల నటి.

మిథాలీ చేత కేక్​ కోయిస్తున్న నటి తాప్సీ

" హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ మిథాలీ రాజ్. క్రికెట్​లో ఎన్నో రికార్డులతో మమ్మల్ని గర్వపడేలా చేశావు. నీ జీవిత ప్రయాణాన్ని తెరపై చూపించే అవకాశం నాకు లభించినందుకు గౌరవంగా భావిస్తున్నా. నీ పుట్టినరోజు సందర్భంగా ఏ బహుమానం ఇవ్వాలో తెలియడం లేదు కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ బయోపిక్‌లో నా రూపంలో నిన్ను నువ్వు చూసుకొని తప్పకుండా గర్వపడతావు. ఇక నేను కవర్ డ్రైవర్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను"

-- తాప్సీ, సినీ నటి.

వయాకామ్ 18 సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు.. రాయిస్​ ఫేమ్ రాహుల్ ధొలాకియా దర్శకత్వం వహిస్తున్నాడు.

ముచ్చటగా మూడోది...

వైవిధ్యమైత కథాంశాలతో మంచి పేరు తెచ్చుకున్న తాప్సీ... వరుసగా మూడో బయోపిక్‌లో నటిస్తోంది. ఆమె నటించిన 'సాండ్ కీ ఆంఖ్' సినిమా దీపావళికి విడుదలై మంచి విజయం అందుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షూటర్స్ ప్రకాశీ​ తోమర్, చంద్రో తోమర్‌ల జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ప్రకాశీ పాత్రలో తాప్సీ నటించగా, చంద్రో పాత్రలో భూమి పడ్నేకర్ కనిపించింది.

ప్రస్తుతం తాప్సీ... 'రాకెట్ రష్మి' అనే మరో బయోపిక్‌లోనూ నటిస్తోంది. గుజరాత్‌కి చెందిన రష్మి అనే అథ్లెట్​ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. హిందీలో 'నామ్ షబానా', 'బద్లా', 'మిషన్ మంగళ్' వంటి చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకుందీ దిల్లీ భామ.

మిథాలీతో ఫొటో దిగిన తాప్సీ
Last Updated : Dec 3, 2019, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details