తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ ఓటమి ఇప్పటికీ మమ్మల్ని బాధిస్తోంది' - 2018-19 బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ

2018-19లో భారత్​తో జరిగిన టెస్టు సిరీస్​లో ఆస్ట్రేలియాకు పరాభవం ఎదురైంది. అయితే ఆ ఓటమి ఇప్పటికీ బాధిస్తోందని ఆసీస్​ టెస్టు కెప్టెన్​ టిమ్​ పైన్​ అన్నాడు. టీమ్​ఇండియాపై ప్రతీకారం తీర్చుకునేందుకు తమ ఆటగాళ్లంతా సిద్ధంగా ఉన్నారని తెలిపాడు.

Series loss to India still annoys and grinds me, Says Tim Paine
ఆ ఓటమి ఇప్పటికీ మమ్మల్ని బాధిస్తోంది: టిమ్​ పైన్

By

Published : Nov 25, 2020, 7:06 AM IST

భారత్​తో 2018-19 టెస్టు సిరీస్​లో ఓటమి ఇప్పటికీ వేదన కలిగిస్తోందని ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్​ పైన్​ అన్నాడు. జట్టులో వార్నర్​ ఉన్నా లేకున్నా ఓడిపోవడం సరికాదని అభిప్రాయపడ్డాడు.

"భారత్​తో గత టెస్టు సిరీస్​లో ఓడిపోవడం ఇంకా బాధను కలిగిస్తోంది. జట్టులో స్మిత్​, వార్నర్​ ఉన్నా లేకపోయినా టెస్టు మ్యచ్​నో లేదా సిరీస్​నో ఓడిపోవడం సరికాదు. ప్రస్తుతం మా జట్టు సమతూకంతో ఉంది. అయితే స్మిత్​, వార్నర్​ పునరాగమనంతో వచ్చిన మార్పు మాత్రమే కాదిది. గత 18 నెలలుగా ఆసీస్​ ఎంతో మెరుగైంది. బ్యాట్స్​మెన్​ ఫామ్​లో ఉన్నారు. భారత్​పై సత్తా చాటేందుకు.. ప్రతీకారం తీర్చుకునేందుకు కుర్రాళ్లంతా ఉవ్విళ్లూరుతున్నారు. గత సిరీస్​లో మా బ్యాట్స్​మెన్​ పెద్దగా రాణించలేదు. టీమ్​ఇండియా పేసర్లను గత సిరీస్​ కంటే ఎక్కువసేపు బౌలింగ్ చేయించగలిగితే మిగిలిన పని మా బౌలర్లు చూసుకుంటారు".

- టిమ్​ పైన్​, ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్

2018-19 సిరీస్​లో కోహ్లీసేన నాలుగు టెస్టు సిరీస్​లో ఆస్ట్రేలియాపై 2-1తో గెలిచి చరిత్ర సృష్టించింది. ​

ABOUT THE AUTHOR

...view details