శనివారం జరిగిన ఫైనల్ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించి సిరీస్ గెలుచుకుంది భారత జట్టు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు కొందరు ప్రముఖులు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... టీమ్ఇండియా ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరినందుకు అభినందనలు తెలిపారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. మొతేరా మైదానంలో భారత జట్టు తొలి రెండు మ్యాచ్‌లు గెలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆ మైదానాన్ని ప్రారంభించే అవకాశం రావడం చాలా గర్వంగా అనిపిస్తోందని అన్నారు. టీమ్ఇండియాకు అభినందనలు తెలిపారు.
భారత మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్.. టీమ్ ఇండియా బౌలర్లు అశ్విన్, అక్షర్ పటేల్‌ను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. ఇద్దరు స్పిన్నర్లు మళ్లీ విజృంభించారని అన్నాడు.
దిగ్గజ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్.. టీమ్ఇండియాను తనదైన శైలిలో ప్రశంసించాడు. ఇంగ్లాండ్ అహ్మదాబాద్‌లో ఓడలేదని తెలివిని ఉపయోగించడంలో ఓడిందని భిన్నంగా కామెంట్ చేశారు.
రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అశ్విన్, రోహిత్ ఆటతీరును ఆద్యంతం ఎంజాయ్ చేశానంటూ సచిన్ ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్‌పై సిరీస్ గెలినందుకు టీమ్ఇండియాను అభినందించాడు.
ఇదీ చదవండి:ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ షురూ!