తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ ఏడాది కాలం నన్ను మార్చేసింది' - WC19

బాల్ టాంపరింగ్​తో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న ఆస్ట్రేలియా బ్యాట్స్​మెన్​ స్టీవ్​ స్మిత్... ఆ సమయంలో చేసిన కొన్ని అవగాహన కార్యక్రమాలు తనను మరింత దృఢపరిచాయని చెప్పాడు.

'ఆ ఏడాది సమయం నన్ను మార్చేసింది'

By

Published : May 27, 2019, 7:30 AM IST

బాల్​ టాంపరింగ్​తో ఏడాది నిషేధాన్ని ఎదుర్కొన్నాడు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్. అనంతరం ప్రపంచకప్​ బరిలో నిలిచాడు. శనివారం ఇంగ్లాండ్​తో ప్రాక్టీసు మ్యాచ్​లో అదరగొట్టాడు. నిషేధానికి గురైన సమయంలో సామాజిక సేవ, ఆత్మ పరిశీలన చేసుకోవడమే తనని మరింత దృఢంగా తయారు చేశాయని చెప్పాడు.

"ఇంతకు ముందు చేయని కొన్ని పనుల్ని ఈ ఏడాదిలో చేశాను. మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాను. అవి నన్ను మనిషిగా మరింత దృఢంగా మార్చాయి. వరుసగా కొన్నేళ్లపాటు క్రికెట్ ఆడుతున్నా, అలాంటిది సంవత్సరం పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ విషయం బాగా ఆడాలనే పట్టుదలను పెంచింది." -స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా క్రికెటర్

ఈ జనవరిలో స్మిత్​ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. అయినా అది తన బ్యాటింగ్​పై ఏ మాత్రం ప్రభావం చూపలేదని చెప్పాడీ కంగారూ బ్యాట్స్​మెన్.

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్

సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన ప్రాక్టీస్​ మ్యాచ్​లో 12 పరుగుల తేడాతో గెలిచింది ఆసిస్ జట్టు. స్మిత్ 116, వార్నర్ 43 పరుగులు చేసి పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నారు.

ఇది చదవండి: 'మోసగాడా వెళ్లిపో'- వార్నర్, స్మిత్​కు చేదు అనుభవం

ABOUT THE AUTHOR

...view details