తెలంగాణ

telangana

ETV Bharat / sports

జులై 19న విండీస్​తో సిరీస్​కు జట్టు ఎంపిక - బీసీసీఐ

వెస్టిండీస్​తో సిరీస్​కు టీమిండియా జట్టును జులై 19న ప్రకటించనున్నారు సెలక్టర్లు. ఆగస్టు 3 నుంచి సిరీస్ ప్రారంభంకానుంది. విండీస్​ పర్యటనలో భారత్​ 3 టీ-20, 3 వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్​లు ఆడనుంది.

మ్యాచ్

By

Published : Jul 16, 2019, 6:20 AM IST

వరల్డ్​కప్ ఓటమి తర్వాత బీసీసీఐ పాలక మండలి జులై 19న తొలిసారిగా సమావేశం కానుంది. ప్రపంచకప్​లో టీమిండియా ఆటతీరుపై సమీక్షతో పాటు విండీస్​తో సిరీస్​కు ఆటగాళ్లనూ ప్రకటించనున్నారు.

ప్రపంచకప్​ సెమీస్​లోనే వైదొలిగిన టీమిండియా తదుపరి సిరీస్​లపై దృష్టి సారించింది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్​తో జరిగే సిరీస్ కోసం జట్టును ప్రకటించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. ధోనీ కెరీర్​పైనా స్పష్టత రావాల్సి ఉంది.​

ప్రపంచకప్​లో ధోనీ ప్రదర్శనపై విమర్శలు వస్తున్న తరుణంలో వెస్టిండీస్​తో జరగబోయే సిరీస్​లో ఆడతాడా లేదా అనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. మరికొన్ని రోజుల్లో రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న వార్తలూ వినిపిస్తున్నాయి.

"టీమిండియా సెలక్టర్లు జులై 19న ముంబయిలో సమావేశమవుతారు. ధోనీ ప్రపంచకప్​లో బాగా ఆడాడు. ఆటలో కొనసాగాలా వద్దా అనేది ఆటగాడి వ్యక్తిగత నిర్ణయం".
-బీసీసీఐ అధికారి

వెస్టిండీస్​తో జరిగే టీ20, వన్డే సిరీస్​లకు ​కోహ్లీ, బుమ్రా విశ్రాంతి తీసుకోనున్నారు. ప్రపంచకప్​ మ్యాచ్​లో గాయపడ్డ ఓపెనర్ శిఖర్ ధావన్​ ఆడుతాడా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. వన్డే, టీ20లకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు.

ఇవీ చూడండి.. 'ఆ ఆరు పరుగులు అంపైర్ల తప్పిదమే'

ABOUT THE AUTHOR

...view details