తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెరీర్​లో కోహ్లీ బ్రేక్​ చేయలేని రికార్డిదే: సెహ్వాగ్​

అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను బ్రేక్​ చేస్తోన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... సచిన్​ సాధించిన ఓ రికార్డు మాత్రం ఎప్పటికి సాధించలేడట. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు డాషింగ్​ బ్యాట్స్​మెన్​, మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​.

By

Published : Aug 22, 2019, 8:02 PM IST

Updated : Sep 27, 2019, 10:07 PM IST

కెరీర్​లో కోహ్లీ బ్రేక్​ చేయలేని రికార్డిదే: సెహ్వాగ్​

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ వారసుడిగా మన్ననలు పొందుతున్న కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. మాస్టర్​ సాధించిన 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ప్రస్తుతం 68 శతకాలు సాధించిన విరాట్​... ఇదే ఫామ్​ కొనసాగిస్తే కచ్చితంగా సచిన్​ రికార్డును బ్రేక్​ చేసే అవకాశం ఉంది. కోహ్లీ ఎన్ని రికార్డులను నెలకొల్పినా.. సచిన్ సాధించిన ఓ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేడని చెప్తున్నాడు భారత మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​. వీలైతే సాధించేందుకు ప్రయత్నించాలని కోహ్లీకి సవాల్ విసిరాడు.

సచిన్​,కోహ్లీ

" సచిన్ తెందుల్కర్ పేరిట 200 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రికార్డు ఉంది. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లు అన్ని టెస్ట్ మ్యాచ్‌లు కచ్చితంగా ఆడలేరు. ఈ శకంలో విరాట్ కోహ్లీ మేటి బ్యాట్స్​మెన్​ అయినా సచిన్​ రికార్డును బ్రేక్ చేయలేడు".
-- సెహ్వాగ్​, భారత మాజీ క్రికెటర్​

విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌స్మిత్‌లో ఎవరు గొప్ప బ్యాట్స్‌మన్‌ అనే ప్రశ్నకూ సమాధానమిచ్చాడు సెహ్వాగ్​. స్మిత్‌ కన్నా కోహ్లీయే అత్యుత్తమ ఆటగాడని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు వీరిద్దరినీ చూస్తే స్మిత్‌ కన్నా కోహ్లీ ఆట చూడముచ్చటగా ఉంటుందని చెప్పాడు. అంతేకాకుండా శతకాలు బాదడంలో విరాట్​ బెస్ట్‌ అని వీరూ వెల్లడించాడు.

ఐసీసీ ఇటీవల విడుదల చేసిన టెస్టు ర్యాంకుల జాబితాలో... కింగ్‌ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్‌ మూడు నుంచి రెండో ర్యాంకుకు ఎగబాకాడు. వీరిద్దరి మధ్య 9 పాయింట్ల అంతరం ఉంది. కోహ్లీ ఇప‍్పటివరకు 77 టెస్టులు ఆడగా... స్మిత్​ 66 మ్యాచ్​లు ఆడాడు.

ఇదీ చూడండి...'కోహ్లీ.. నీలో నన్ను నేను చూసుకుంటున్నా'

Last Updated : Sep 27, 2019, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details