మూడు వన్డేల టీ20 సిరీస్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నాయి భారత్-శ్రీలంక. ఇప్పటికే తొలి మ్యాచ్ కోసం గువహటి చేరుకున్నాయి ఇరుజట్లు. తొలి మ్యాచ్ గెలిచి,కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాలని చూస్తున్నాయి. కోహ్లీ సారథ్యంలోని టీమిండియా, లసిత్ మలింగ నేతృత్వంలోని లంక... మైదానం వద్ద హోటళ్లకు చేరుకున్నాయి. అయితే ఈ పోరుకు అభిమానులు ఎంతమంది హాజరవుతారనేది కీలకంగా మారింది. ఇప్పటికే అసోం వ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. వాటి ప్రభావం అభిమానుల రాకపై ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
పటిష్ట బందోబస్తు మధ్య మ్యాచ్ జరగనుంది. అసోం క్రికెట్ సంఘంతో పాటు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ).. దీనిపై ఓ కన్నేసి ఉంచుతోంది.
ఈ సిరీస్ కోసం భారత జట్టులోని సీనియర్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో చోటు దక్కించుకున్నారు.
లంకేయులూ సిద్ధం
లంక జట్టుకు సీనియర్ పేసర్ లసిత్ మలింగ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్ కోసం 16 మందితో భారత గడ్డపై అడుగుపెట్టింది శ్రీలంక. దాదాపు 16 నెలల విరామం తర్వాత ఆ జట్టు ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్.. మళ్లీ పొట్టి ఫార్మాట్లో అడుగుపెడుతున్నాడు.