తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆక్లాండ్ ఆట మనదే

కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్​లో భారత జట్టు జూలు విదిల్చింది.  సమష్టి కృషితో కివీస్​పై 7 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకొని సిరీస్​ కోల్పోకుండా కాపాడుకొంది.

By

Published : Feb 8, 2019, 3:46 PM IST

రెండో టీట్వంటీలో భారత జయకేతనం

టీమిండియా బ్యాట్స్​మెన్, బౌలర్లు చెలరేగిన వేళ ఆక్లాండ్​లో జరిగిన రెండో టీ-ట్వంటీలో న్యూజిలాండ్​పై భారత్ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలన్న కివీస్ ఆశలు ఆవిరయ్యాయి. 159 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో 7 బంతులు మిగిలుండగానే భారత్​ పూర్తి చేసింది. కృనాల్​ పాండ్య మ్యాన్​ ఆఫ్​ది మ్యాచ్​గా నిలిచాడు.

రో"హిట్" షో...
గత మ్యాచ్​ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ముఖ్యంగా భారత ఓపెనింగ్ ద్వయం అదిరే ఆరంభాన్ని ఇచ్చింది. మొదటి వికెట్​కు 79 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది రోహిత్-ధావన్ జోడి.

గత మ్యాచ్​లో ఒక పరుగుకే వెనుదిరిగినా..ఈ మ్యాచ్​లో అర్థసెంచరీ చేసిన రోహిత్ శర్మ భారత విజయానికి బాటలు వేశాడు.

రోహిత్ శర్మ

ధావన్ 30 పరుగులు చేయగా, రిషభ్ పంత్ 40 పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ధోని 20 పరుగులతో సహాకారమందించాడు.
ఈ మ్యాచ్​ గెలిచి సిరీస్ సమం చేసుకుంది భారత్ జట్టు. ఆదివారం జరిగే నిర్ణయాత్మక మూడో టీట్వంటీలో గెలిచిన జట్టుదే సిరీస్.

భారత్ బౌలింగ్ అదరహో..!
గత మ్యాచ్​లో 219 పరుగులు చేసిన ఆతిధ్య జట్టు ఈ మ్యాచ్​లో 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్​తో న్యూజిలాండ్ బ్యాట్స్​మెన్స్ తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. గత మ్యాచ్ హీరో టిమ్ స్టీఫర్డ్ ఈ మ్యాచ్​లో కేవంల 12 పరుగులకే పరిమితమయ్యాడు.

భారత్ బౌలర్లు

కివీస్ జట్టులో ఆల్​రౌండర్​ గ్రాండ్​హోం మాత్రమే అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రాస్​ టేలర్ 42 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

అర్థ సెంచరీ చేసిన గ్రాండ్​హోం

భారత్ బౌలింగే ఈ రోజు మ్యాచ్​లో ప్రధాన ఆకర్షణ. గత మ్యాచ్​లో ధారాళంగా పరుగులిచ్చిన భారత బౌలర్లు ఈ మ్యాచ్​లో రాణించారు. 28 పరుగులకు 3 వికెట్ల తీసిన కృనాల్ పాండ్య టీమిండియా విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. రెండు వికెట్లతో ఖలీల్, తలో వికెట్ తీసిన భువనేశ్వర్, హార్దిక్ పాండ్య కృషిని మెచ్చుకోవాలిసిందే.

కివీస్ పతనాన్ని శాసించిన కృనాల్ పాండ్య

ఔటే కానీ...
కృనాల్ పాండ్య బౌలింగ్​లో మిచెల్ ఔటైన తీరు ఆశ్చర్యం కలిగించింది. బంతిని డిఫెన్స్ చేయగా అది ముందు బ్యాట్​కు తగిలి తర్వాత ప్యాడ్​కు తగిలింది. అంపైర్ ఔట్ అయినట్టు ప్రకటించాడు. న్యూజిలాండ్ రివ్యూ కోరినా అందులోనూ ఔటైనట్టు ప్రకటించారు. నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు మిచెల్. దీనిపై కివీస్ సారథి విలియమ్సన్ ఆసహనం వ్యక్తం చేశాడు.

రికార్డులు...
⦁ రోహిత్ శర్మకు ఇది టీట్వంటీల్లో 16వ అర్ధశతకం.
⦁ 2288 పరుగులతో అంతర్జాతీయ టీట్వంటీల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్.

ABOUT THE AUTHOR

...view details