తెలంగాణ

telangana

ETV Bharat / sports

బౌలింగ్​లోనూ భారత్ భేష్​​.. కష్టాల్లో సఫారీ జట్టు - aswin

విశాఖ వేదికగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 3 వికెట్లు నష్టానికి 39 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్​లో భారత్ 502/7 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మయాంక్ అగర్వాల్ ద్విశతకంతో ఆకట్టుకున్నాడు.

టీమిండియా

By

Published : Oct 3, 2019, 6:03 PM IST

తొలి ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​తో అదరగొట్టిన భారత్​ అనంతరం బౌలింగ్​లోనూ శుభారంభం చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 39 పరుగులకే 3 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను ఇబ్బందుల్లో నెట్టింది. అశ్విన్ రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. జడేజా ఓ వికెట్ తీశాడు. అంతకుముందు మయాంక్ అగర్వాల్(215), రోహిత్(176) బ్యాటింగ్​ ప్రదర్శనకు ఫలితంగా 502/7 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది టీమిండియా.

భారీ స్కోరు చేయాలనే లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికాను ఆరంభంలోనే దెబ్బకొట్టాడు రవిచంద్రన్ అశ్విన్. ఓపెనర్ మర్కరమ్​ను(5) తక్కువ పరుగులకే ఔట్ చేశాడు. అనంతరం థియునిస్​ నూ(4) పెవిలియన్​కు పంపాడు. ఆ సమయంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చిన డేన్​ను... డకౌట్​ చేసి సఫారీలను మరింత కష్టాల్లో నెట్టాడు జడేజా.

మయాంక్ అగర్వాల్

తొలి ఇన్నింగ్స్​ స్కోరు అధిగమించాలంటే దక్షిణాఫ్రికా ఇంకా 463 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. క్రీజులో డీన్ ఎల్గర్(27), బవుమా(2) ఉన్నారు.

202 పరుగుల ఓవర్​నైట్ స్కోరు వద్ద రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత ఓపెనర్లు మరోసారి విజృంభించారు. మయాంక్ అగర్వాల్ ద్విశతకంతో అదరగొట్టగా.. రోహిత్ శర్మ 176 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా 7 వికెట్ల నష్టానికి భారత్ 502 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇదీ చదవండి: ముగిసిన భారత తొలి ఇన్నింగ్స్​... 502/7 డిక్లేర్​

ABOUT THE AUTHOR

...view details