బీసీసీఐపాలక మండలిలో తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకుసినీయర్ న్యాయవాది పీఎస్ నరిసింహను మధ్యవర్తిగా నియమించింది జస్టిస్ఎస్.ఏ.బోబ్డే, జస్టిస్ ఏ.ఎం.స్పేర్లతో కూడిన సుప్రీం ధర్మాసనం. ప్రస్తుతం ఈయన బీసీసీఐ వివాదంలో సుప్రీంలో అమికస్ క్యూరీగా ఉన్నారు.
బీసీసీఐ వివాదాల పరిష్కారానికి మధ్యవర్తి
రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు, బీసీసీఐకి మధ్య వివాదాల పరిష్కారం కోసం సీనియర్ అడ్వకేట్ పీ.ఎస్ నరసింహను మధ్యవర్తిగా నియమించింది సుప్రీంకోర్టు.
నిధుల వ్యవహారంలో దేశంలోని వివిధ క్రికెట్ అసోసియేషన్లకు, బీసీసీఐకి మధ్య తలెత్తే గొడవలపై కూడా అమికస్ క్యూరీకి పర్యవేక్షణాధికారం కట్టబెట్టింది సుప్రీం ధర్మాసనం. నిష్పక్షపాతంగా న్యాయ సలహాలు ఇచ్చే కోర్టు తరఫు న్యాయవాదిని అమికస్ క్యూరీ అంటారు.
బీసీసీఐ వివాదల పరిష్కారం కోసంఫిబ్రవరి 21నఅంబుడ్స్మెన్ను ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. మాజీ న్యాయమూర్తి జైన్‌ను ఆ పదవికి నియమించారు. క్రికెట్ అసోసియేషన్లకు నిధుల చెల్లింపు విషయంలో బీసీసీఐ పాలక మండలి(సీఓఏ)కి అమికస్ క్యూరీ సలహాలందిస్తారు.