తెలంగాణ

telangana

ETV Bharat / sports

అద్భుత టాలెంట్ అతడి సొంతం: స్మిత్ - smith

ఇంగ్లాండ్​ బౌలర్​ జోఫ్రా ఆర్చర్​ను పొగడ్తలతో ముంచెత్తాడు ఆసీస్ బ్యాట్స్​మన్ స్టీవ్ స్మిత్. ప్రత్యేకమైన టాలెంట్ అతడి సొంతమని, మంచి భవిష్యత్తు ఉందని తెలిపాడు. యాషెస్ సిరీస్​లో 774 పరుగులు చేశాడు స్మిత్.

ఆర్చర్ - స్మిత్

By

Published : Sep 16, 2019, 7:05 AM IST

Updated : Sep 30, 2019, 6:55 PM IST

యాషెస్​ రెండో టెస్టులో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి స్టీవ్ స్మిత్​కు తగలకుండా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో! బ్రాడ్​మన్ అత్యధిక పరుగుల(974) రికార్డునూ స్మిత్ బద్దలు కొట్టేవాడేమో! ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. అయితే స్మిత్ మాత్రం జోఫ్రా ఆర్చర్​ను పొగడ్తలతో ముంచెత్త్తుతున్నాడు. ఆర్చర్​కు ప్రత్యేకమైన టాలెంట్ ఉందని ఆదివారం ఆఖరి టెస్టు అనంతరం చెప్పాడు.

"గత ఏడాది ఐపీఎల్​లో తొలిసారి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చూశా. ప్రత్యేకమైన టాలెంట్ అతడి సొంతం. ఆర్చర్​కు మంచి భవిష్యత్తు ఉంది" -స్టీవ్ స్మిత్, ఆసీస్ క్రికెటర్.

ఇంగ్లీష్ బౌలర్ అండర్సన్ గైర్హాజరుతో జట్టులో చోటు దక్కించుకున్నాడు జోఫ్రా ఆర్చర్. ఇప్పటికే ప్రపంచకప్​లో సత్తాచాటిన ఆర్చర్.. టెస్టు ఫార్మాట్​లోనూ ఆకట్టుకున్నాడు. 22 వికెట్లతో ఈ యాషెస్​ సిరీస్​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు ప్యాట్ కమిన్స్(26), స్టువర్ట్ బ్రాడ్(23) ఉన్నారు.

ఈ సిరీస్​లో స్టీవ్ స్మిత్ ఏడు ఇన్నింగ్స్​లు ఆడి 110.57 సగటుతో 774 పరుగులు చేశాడు. ఈ మిలీనియంలో ఓ టెస్టు సిరీస్​లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. యాషెస్​ సిరీస్​ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది.

ఇదీ చదవండి: 47 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్ డ్రా

Last Updated : Sep 30, 2019, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details