గత కొంతకాలంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు వైఫల్యాలు ఎదుర్కొంటోంది. ఇటీవలే స్వదేశంలో శ్రీలంక చేతిలో టీ20 సిరీస్ ఓడిపోయింది. అందుకే పగ్గాలు మార్చాలని నిర్ణయించుకుంది మేనేజ్మెంట్. ప్రస్తుతం టెస్టు, టీ20లకుసారథ్యం వహిస్తోన్న సర్ఫరాజ్‌కు ఉద్వాసన పలికింది. టెస్టులకు అజహర్ అలీ, టీ20లకు బాబర్ అజమ్‌ను సారథిగా నియమిస్తూ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఉద్వాసన
పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్లుగా అజహర్ అలీ, బాబర్ అజమ్లను నియమిస్తూ, ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఉద్వాసన
గత రెండేళ్ల నుంచి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నాడు సర్ఫరాజ్. 2017 ఛాంపియన్స్ ట్రోఫీని ఇతడి సారథ్యంలోనే గెల్చుకుంది పాక్.
ఇది చదవండి: పాక్ సారథి సర్ఫ్రాజ్ ఆవలింతలు... నెట్టింట ట్రోల్