తెలంగాణ

telangana

ETV Bharat / sports

పురుషుల జట్టుకు కోచ్​గా సారా టేలర్ రికార్డు - సారా టేలర్ కోచింగ్

ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. పురుషుల జట్టుకు కోచ్​గా పనిచేయనున్న తొలి మహిళా క్రికెటర్​గా రికార్డు సృష్టించింది.

Sarah Tayor
సారా టేలర్

By

Published : Mar 17, 2021, 12:01 PM IST

ఇంగ్లాండ్‌ మాజీ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌ అరుదైన ఘనత సాధించింది. తొలిసారి పురుషుల క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా ఎంపికైంది. ఇంగ్లాండ్‌లోని దేశవాళీ జట్టు ససెక్స్‌కు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా పనిచేయనుంది. పురుషులతో కలిసి అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడిన మొదటి మహిళా క్రికెటర్‌ కూడా సారాయే కావడం గమనార్హం.

ఇంగ్లాండ్‌ తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20లు ఆడిన సారా టేలర్‌ 2019లో క్రికెట్​కు వీడ్కోలు పలికింది. సుదీర్ఘ ఫార్మాట్లో 300, వన్డేల్లో 4,056, టీ20ల్లో 2,177 పరుగులు సాధించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 104 స్టంపింగ్స్‌, 128 క్యాచులు అందుకుంది. 2017లో జరిగిన ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌ గెలవడంలో సారా కీలక పాత్ర పోషించింది.

సారా టేలర్

కెరీర్లో అత్యుత్తమంగా రాణిస్తున్న దశలో టేలర్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. మానసిక ఆరోగ్య సమస్యలతో 30 ఏళ్లకే ఆటకు దూరమైంది. ఆ తర్వాత ఈస్ట్‌బౌర్న్‌లోని ఓ పాఠశాలలో క్రీడలు, లైఫ్‌ కోచ్‌గా పనిచేసింది. ససెక్స్‌ మెంటల్‌ హెల్త్‌, వెల్‌బీయింగ్‌ హబ్‌ను నెలకొల్పేందుకు కృషి చేసింది. అయితే ఆమె మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించినా ఆశ్చర్యం లేదని గతంలో ఓసారి వెల్లడించింది.

ఇవీ చూడండి: భారత్-ఇంగ్లాండ్ టీ20: ఈ రికార్డులపై ఓ లుక్కేయండి!

ABOUT THE AUTHOR

...view details