మైదానంలో నిరంతరం పరుగుల వరద పారించినా వరుస వికెట్లు తీసినా ఆ క్రికెటర్లకు ఉండే క్రేజే వేరు! ఇక ఆ ఆటగాళ్లు సెలబ్రిటీ అమ్మాయిలతో కలిసి మాట్లాడితే.. వారి సోషల్ మీడియా ఖాతాల్లో చిలిపి సందేశాలు పెడితే.. పదేపదే వారిపై గాసిప్స్ వినిపిస్తుంటే అందరికీ ఏమనిపిస్తుంది? వారిద్దరి మధ్య ఏదో ఉందనిపిస్తుంది. అంతేకదా!
గిల్-సారా మధ్య ఏదో ఉందంటోన్న నెటిజన్లు - శుభ్‌మన్ గిల్ సారా ఫొటో వైరల్
టీమ్‌ఇండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమార్తె సారా మధ్య ఏదో ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. సామాజిక మాధ్యమాల్లో వీరి పోస్టులే అందుకు బలం చేకూరుస్తున్నాయి.
ప్రస్తుతం టీమ్‌ఇండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమార్తె సారా మధ్య ఏదో ఉందని సామాజిక మాధ్యమాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వారిద్దరి మధ్య సామాజిక మాధ్యమాల్లో అనుబంధం అలా ఉంటుంది మరి! చాలాకాలంగా వీరిద్దరూ ఒకరినొకరు అనుసరిస్తున్నారు. పరస్పరం అనేక విషయాల్లో కామెంట్లు పెడుతున్నారు. ఆ మధ్యన గిల్ ఓ కారుకొంటే అందుకు సారా అభినందనలు తెలియజేసింది. "అప్పుడు వెంటనే నీ బదులు సారాకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను బ్రో" అని గిల్‌ను హార్దిక్ పాండ్య కవ్వించాడు.
తాజాగా శుభ్‌మన్ ఇన్‌స్టాలో ఓ అందమైన చిత్రం పోస్ట్ చేశాడు. దానికి "ఐ స్పై" అని వ్యాఖ్య జత చేశాడు. యాదృచ్ఛికంగా అదే సమయానికి సారా తెందూల్కర్ కూడా తన ఫొటో పెట్టి "ఐ స్పై" అని పోస్ట్ చేసింది. వీరిద్దరివీ వ్యక్తిగత చిత్రాలే అయినప్పటికీ ఒకే సమయంలో ఒకే తరహా వ్యాఖ్య పెట్టడం వల్ల మళ్లీ అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. వీరిలో ఎవరు ఎవరిపై నిఘా పెట్టారో తెలియాలంటే స్వయంగా వారే స్పష్టత ఇచ్చేంతవరకు ఎదురుచూడక తప్పదు మరి!