ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. గతేడాది ప్రపంచకప్ సందర్భంగా టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అప్పుడే అతడిపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో చెన్నై క్రికెటర్లు పియూష్ చావ్లా, అంబటి రాయుడులను తక్కువ ప్రొఫైల్ ఉన్న వాళ్లని ట్వీట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన సీఎస్కే అభిమానులు.. సంజయ్‌పై విమర్శలు తీవ్రం చేశారు. చావ్లా రెండు ప్రపంచకప్ జట్లలో భాగమవగా.. రాయుడు టీమ్ఇండియా తరఫున 55 వన్డేలు ఆడాడు.
రాయుడు, చావ్లాపై మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సీఎస్కే ఆటగాళ్లు చావ్లా, రాయుడులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. దీంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.
సంజయ్ మంజ్రేకర్
ఈ ఏడాది మార్చిలో, వ్యాఖ్యత ప్యానెల్ నుంచి మంజ్రేకర్‌ను బీసీసీఐ తొలగించింది. ఈ ఏడాది ఐపీఎల్ కోసం తనను కామెంటేటర్‌గా నియమించమని కోరుతూ బోర్డుకు లేఖ రాశాడు. కానీ అతడికి అంగీకారం తెలపలేదు. దీంతో లీగ్‌లో భాగం కాలేకపోయారు.