కేంద్ర ప్రభుత్వ టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నాలుగేళ్ల తర్వాత మళ్లీ చోటు దక్కింది. టోక్యో ఒలింపిక్స్‌కు సానియా ఇప్పటికే అర్హత సాధించినందున టాప్‌లో ఆమెకు స్థానం కల్పించారు. 2017లో గాయమవడం వల్ల టాప్ పథకం నుంచి సానియా వైదొలిగింది.
నాలుగేళ్ల తర్వాత 'టాప్'లోకి సానియా - టాప్ పథకంలోకి సానియా మీర్జా
కేంద్ర ప్రభుత్వ టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో చోటు దక్కించుకుంది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. టోక్యో ఒలింపిక్స్‌కు సానియా ఇప్పటికే అర్హత సాధించినందున టాప్‌లో ఆమెకు స్థానం కల్పించారు.

సానియా
బిడ్డకు తల్లి కాబోతున్న కారణంగా ఆట నుంచి విరామం తీసుకునే ముందే 'ప్రొటెక్టెడ్ ర్యాంకింగ్' ఆధారంగా టోక్యో ఒలింపిక్స్‌కు సానియా అర్హత సాధించింది. ప్రస్తుతం సానియా 157వ ర్యాంకులో ఉంది.
డబ్ల్యూటీఏ నిబంధనల ప్రకారం గాయం లేదా గర్భధారణ కారణంగా ఆర్నెల్లకు పైగా ఆటకు దూరమయ్యే క్రీడాకారులు ప్రత్యేక ర్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీన్ని 'ప్రొటెక్టెడ్ ర్యాంకింగ్' అంటారు. విరామానికి ముందు ఆమె ర్యాంకు 9 కావడం వల్ల టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.