తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అంపైర్లు రవి, నందన్​లపై చర్యలు ఉండకపోవచ్చు'

బెంగళూరు - ముంబయి ఐపీఎల్ మ్యాచ్​లో నోబాల్​ని ప్రకటించడంలో విఫలమైన అంపైర్ రవి, నందన్​లపై చర్యలు తీసుకోకపోవచ్చని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కారణం ఐపీఎల్ కోసం కేవలం 11 మందే భారత అంపైర్లు ఉండటం.

ఎస్ రవి

By

Published : Mar 29, 2019, 11:25 PM IST

బెంగళూరు - ముంబయి మ్యాచ్​లో నోబాల్​ను గుర్తించడంలోఅంపైర్ సుందరం రవి విఫలమయ్యారు. అయితే ఆ మ్యాచ్​ అంపైర్లు రవి, నందన్​లపై ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.


"ఐపీఎల్ కోసం కేవలం 17 మంది అంపైర్లు మాత్రమే ఉన్నారు. అందులో 11 మంది భారతీయులు, ఆరుగురు విదేశీయులు. వీరు కాకుండా మరో ఆరుగురు నాలుగో అంపైర్​గా ఉన్నారు"
-బీసీసీఐ అధికారి

ఐసీసీ ఎలైట్ ప్యానల్​లో ఉన్న ఏకైక భారతీయ అంపైర్ రవి. మరో అంపైర్ నందన్... రెండేళ్ల క్రితం బీసీసీఐ నుంచి ఉత్తమ అంపైర్ అవార్డు గెలుచుకున్నాడు. వీరిద్దరూ బెంగళూరు - ముంబయి మ్యాచ్​లో నోబాల్​ని గుర్తించకపోవడం పట్ల క్రీడాభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్ ప్లేఆఫ్స్​ నుంచి అంపైర్ రవి, నందన్​లని పక్కనపెడతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంపైర్ రవిపై మ్యాచ్ రిఫరీ నుంచి నెగటివ్ మార్కింగ్ పొందొచ్చు. కానీ ఐపీఎల్ మ్యాచ్​ల నుంచి నిషేధం విధించే అవకాశం లేదని బీసీసీఐ అధికారి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details