తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెలరేగిన శాంసన్.. భారత్​-ఏ విజయం​ - dhawan

దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న అనధికారిక ఐదు వన్డేల సిరీస్​ను భారత్​ 4-1తేడాతో కైవసం చేసుకుంది. చివరి వన్డేలో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. సంజు శాంసన్ 91 పరుగులతో ఆకట్టుకున్నాడు.

శాంసన్

By

Published : Sep 6, 2019, 7:23 PM IST

Updated : Sep 29, 2019, 4:28 PM IST

తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికా-ఏతో జరిగిన ఐదో వన్డేలో భారత-ఏ జట్టు 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్​ను 20 ఓవర్లకు కుదించారు.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్​ ప్రశాంత్ చోప్రా 2 పరుగులకే వెనుదిరిగినా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్​ (51) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. సంజు శాంసన్​-ధావన్ రెండో వికెట్​కు 135 పరుగులు జోడించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన శాంసన్..48 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి. చివర్లో సారథి శ్రేయస్ అయ్యర్ 19 బంతుల్లో 36 పరుగులు సాధించగా.. భారత్​ 200 పరుగుల మార్కును దాటింది.

205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు.. 26 పరుగులకే ఓపెనర్లు జన్నెమన్ మలన్, బవుమా వికెట్లను కోల్పోయింది. హెండ్రిక్స్ (59) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. వెర్రెన్నే 44 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ ఔటయ్యాక దక్షిణాఫ్రికా జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. 168 పరుగులకు ఆలౌటైంది.

భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వాషింగ్టన్ సుందర్ రెండు, ఇషాన్ పోరెల్, తుషార్ దేశ్​పాండే, రాహుల్ చాహర్, శివం దూబే చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఇవీ చూడండి.. నాలుగో స్థానంపై కొత్త బ్యాటింగ్​ కోచ్​ మనసులో మాట

Last Updated : Sep 29, 2019, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details