తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీని మించిన సూపర్ స్టార్ లేడు: బిల్లింగ్స్ - dhoni ipl

టీమ్​ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్. వచ్చే ఐపీఎల్​లో మహీ రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ధోనీని మించిన సూపర్ స్టార్ లేడు: బిల్లింగ్స్
ధోనీని మించిన సూపర్ స్టార్ లేడు: బిల్లింగ్స్

By

Published : Aug 1, 2020, 12:52 PM IST

టీమ్ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఆటకు దూరమై ఏడాది గడుస్తోంది. మార్చిలో నిర్వహించిన చెన్నై శిక్షణా శిబిరంలో పాల్గొన్న అతడు మళ్లీ ఇప్పుడు ఐపీఎల్‌ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదని ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ సామ్‌ బిల్లింగ్స్‌ అన్నాడు. తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడిన ఈ సీఎస్కే మాజీ ఆటగాడు చెన్నై సారథిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏడాది కాేలంగా ఆటకు దూరమైనా తన అనుభవంతో ఈసారి ఐపీఎల్‌లో ధోనీ రాణిస్తాడని చెప్పాడు. అలాగే లాక్‌డౌన్‌ కారణంగా చాలా రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆటగాళ్లు వ్యక్తిగతంగా త్వరలోనే ప్రాక్టీస్‌ మొదలుపెట్టాలని సూచించాడు.

"ధోనీకున్న అనుభవంతో తనకేం కావాలో తెలుసని, ఆ విషయంలో అతడిని మించిన ఆటగాడు లేడు. మహీ పెద్ద సూపర్‌ స్టార్‌. అతడు మాంచెస్టర్‌ యునైటెడ్‌ అభిమాని కూడా. ఎప్పుడైనా ఆ జట్టు మ్యాచ్‌లు జరుగుతుంటే నన్ను ఆహ్వానించేవాడు. అతడి గదికెళ్లి మరీ వీక్షిస్తా. క్రికెట్‌కు సంబంధించిన అనేక విషయాలను ధోనీ నుంచి నేర్చుకున్నా. అందరితో కలివిడిగా ఉంటూ, యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తాడు. వారిలోని నైపుణ్యాలను బయటకు తీసుకువస్తాడు" అంటూ బిల్లింగ్స్ వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details