తెలంగాణ

telangana

ETV Bharat / sports

లాక్​డౌన్​ వల్ల వాళ్లకు మతి చెడింది: సాక్షి సింగ్​ - ధోనీ రిటైర్మెంట్​ సాక్షి సింగ్​ వార్తలు

టీమిండియా సీనియర్​ క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ క్రికెట్​కు వీడ్కోలు పలుకుతున్నట్లు బుధవారం ట్విట్టర్​లో పెద్ద చర్చే నడిచింది. తొలుత కొంతమంది 'మహీ రిటైర్స్'​ పేరును ట్రెండింగ్​ చేయగా.. ఆ తర్వాత 'ధోనీ నెవ్వర్​ రిటైర్స్​'​ పేరుతో అభిమానులు మహీకి మద్దతుగా నిలిచారు. అయితే ఈ వార్తలన్నీ పుకార్లే అంటూ కొట్టిపడేసింది ధోనీ భార్య సాక్షి సింగ్​.

Sakshi Singh Abrogated netizens 'mentally unstable' rumours of MS Dhoni's retirement, later tweet deleted
లాక్​డౌన్​లో వాళ్లకు మతి చెడింది: సాక్షి సింగ్​

By

Published : May 28, 2020, 1:06 PM IST

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై సామాజిక మాధ్యమాల్లో మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. మే 27 సాయంత్రం 'ధోనీ రిటైర్స్​' అనే హ్యాష్‌ట్యాగ్​ ట్విట్టర్​లో ట్రెండింగ్‌గా మారగా.. ఆ తర్వాత మహీ సతీమణి సాక్షి స్పందించారు. బుధవారం అర్ధరాత్రి ఆమె ఈ విషయంపై స్పష్టతనిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు.

"ఈ లాక్‌డౌన్‌తో పుకార్లు ప్రచారం చేసే వారి మానసిక పరిస్థితి దెబ్బతినిందని అర్థం చేసుకుంటా. వాళ్లకి ఈ వార్తలతో సాంత్వన కలిగిందేమో!" అని ట్వీట్‌ చేశారు. అయితే సాక్షి ఈ పోస్టు చేసిన కొద్దిసేపటికే మళ్లీ తొలగించారు.

సాక్షి సింగ్​ తొలగించిన ట్వీట్​

2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్​ మ్యాచ్​లో చివరిగా ఆడాడు ధోనీ. ఆ టోర్నీలో టీమ్‌ఇండియా ఓటమి తర్వాత ఆటకు విరామం తీసుకొని.. కొద్ది రోజులు భారత సైన్యంలో పనిచేశాడు. అనంతరం ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోనీ మళ్లీ ఐపీఎల్‌ ద్వారా క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తాడని అంతా భావించారు. అనుకున్నట్లుగానే మాజీ సారథి మార్చిలో చెన్నైకు వెళ్లి సాధన కూడా చేశాడు. అయితే కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడం వల్ల.. ఈ ఏడాది ఐపీఎల్‌ వాయిదా పడింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మెగాటోర్నీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. దీంతో ధోనీ రిటైర్మెంట్‌పై మళ్లీ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది.

హర్భజన్ కీలక​ వ్యాఖ్యలు...

ధోనీ కెరీర్​కు వీడ్కోలు పలికే అంశంపై ఇటీవలె స్పందించాడు సీనియర్​ క్రికెటర్​ హర్బజన్‌ సింగ్. మహీ ఇకపై టీమ్‌ఇండియాకు ఆడే అవకాశం లేదని చెప్పాడు.

"ధోనీకి 100 శాతం ఐపీఎల్‌ ఆడాలని ఉంది. అయితే భారత జట్టుకు ఆడతాడా లేదా అనే విషయం ఇంకా తేల్చుకోలేదు. మాజీ సారథి ఇకపై టీమ్‌ఇండియాలో ఆడతాడని నేనైతే అనుకోవట్లేదు. అతనిప్పటికే భారత జట్టుకు చాలా చేశాడు. ధోనీ గురించి నాకు తెలిసినంత వరకు.. అతను ఇకపై టీమ్‌ఇండియా జెర్సీ ధరించాలని అనుకోవట్లేదు. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ఆడిన చివరి మ్యాచ్​ అతనికి ఆఖరిదని భావిస్తున్నాడు. ఇంకొందరు కూడా నాతో ఇదే విషయం చెప్పారు" అని భజ్జీ వివరించాడు.

ఇదీ చూడండి: ధోనీ ఆ విషయంలో నన్ను హెచ్చరించాడు: రైనా

ABOUT THE AUTHOR

...view details