తెలంగాణ

telangana

ETV Bharat / sports

సాక్షీ.. అతడు జూనియర్ మహీనా ఏంటి! - సాక్షి సింగ్ ధోనీ ఫొటో

కరోనా లాక్​డౌన్ సమయంలో క్రికెటర్లందరూ నెట్టింట సందడి చేశారు. టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మాత్రం ఎలాంటి విషయాలను పంచుకోలేదు. కానీ అతడి భార్య సాక్షి సింగ్​ అతడికి సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తోంది. తాజాగా మరో ఫొటోను షేర్ చేసింది సాక్షి. కానీ ఆ ఫొటో ఫ్యాన్స్​లో అనుమానాల్ని రేకిత్తిస్తోంది.

సాక్షీ.. అతడు జూనియర్ మహీనా ఏంటి!
సాక్షీ.. అతడు జూనియర్ మహీనా ఏంటి!

By

Published : Aug 12, 2020, 5:29 AM IST

కరోనా వైరస్‌ ముప్పుతో లాక్‌డౌన్‌ అమలు చేయడం వల్ల క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితయ్యారు. కుటుంబ సభ్యులతో హాయిగా కాలక్షేపం చేశారు. వారి పిల్లలతో ఆడారు. పాడారు. ముద్దూముచ్చట తీర్చారు. మైదానంలో నేరుగా కనిపించనప్పటికీ అభిమానులతో సోషల్‌ మీడియాలో మాత్రం టచ్‌లో ఉన్నారు. టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నాడు. అయితే అతడి సతీమణి సాక్షి మాత్రం చురుగ్గా ఉంటుంది. కానీ కొన్నాళ్లుగా మునుపటి సందడి మాత్రం కనిపించడం లేదు.

తాజాగా సాక్షీసింగ్‌ ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ చిత్రం పంచుకుంది. అందులో తన ముద్దుల కుమార్తె జీవా ఓ బుజ్జాయిని పట్టుకుంది. తదేకంగా అతడినే చూస్తోంది. ఈ పోస్టుకు సాక్షి ఎలాంటి వ్యాఖ్య పెట్టకపోవడం వల్ల అభిమానుల్లో గుసగుసలు మొదలయ్యాయి. అతడు జూనియర్‌ మహీనా? అని కామెంట్లు పెడుతున్నారు. ఎంతో ముద్దుగా ఉన్నాడు. ఇంతకీ ఎవరితడు? జూనియర్‌ హార్దిక్‌ పాండ్యనా ఏంటి? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా మహీ రిటైర్‌మెంట్‌పై ఎన్నోసార్లు వేగంగా వివరణ ఇచ్చిన సాక్షి దీనిపై ఇంకా స్పందించకపోవడం గమనార్హం.

ఐపీఎల్‌-2020 తేదీలు ప్రకటించడం వల్ల ప్రస్తుతం మహీ ఇంట్లోనే సాధన చేస్తున్నాడు. అంతకు ముందు రెండురోజులు ఝార్ఖండ్‌ మైదానంలోని ఇండోర్‌ స్టేడియంలో బౌలింగ్‌ యంత్రం సాయంతో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడని తెలిసింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. త్వరలోనే చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు సభ్యులు చెపాక్‌ శిబిరానికి వస్తున్నారు. 22న దుబాయ్‌కు వెళ్తున్నారని సమాచారం. ప్రయాణానికి 24 గంటల ముందు ఆటగాళ్లకు రెండు సార్లు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేయనున్నారు. ఆ తర్వాత వారంతా బయో బుడగలోకి అడుగుపెడతారు.

ABOUT THE AUTHOR

...view details