తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాండ్య పోస్ట్​కు ధోనీ భార్య సాక్షి కామెంట్

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య పోస్ట్​కు సామాజిక మాధ్యమాల్లో రిప్లే ఇచ్చింది ధోనీ సతీమణి సాక్షి. ధోనీ, జీవాను మిస్​ అవుతున్నట్లు పాండ్య పోస్ట్​ చేయగా దీనిపై కామెంట్ చేసింది.

పాండ్య

By

Published : Nov 4, 2019, 8:23 AM IST

టీమిండియా ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, అతడి కుమార్తె జీవాతో కూడిన ఓ పాత ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు హార్దిక్ పాండ్య. ఈ ఫొటోకు ధోనీ సతీమణి సాక్షి రిప్లే ఇచ్చింది.

ధోనీని, జీవాను మిస్ అవుతున్నట్లు పాండ్య పోస్ట్ చేయగా.. "హార్దిక్ నీకు తెలుసా ? రాంచీలోనూ నీకు ఇల్లు ఉంది" అని కామెంట్ పెట్టింది సాక్షి.

సాక్షి రిప్లే

ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం పలికాడు. భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో వెస్టిండీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీస్‌కూ అందుబాటులో లేడు. హార్దిక్‌ కూడా బంగ్లాదేశ్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. వెన్నులో గాయం కారణంగా లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్న అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఇవీ చూడండి.. ఆ 20 నిమిషాలపై ఫించ్​ అసహనం అందుకే..!

ABOUT THE AUTHOR

...view details