తెలంగాణ

telangana

ETV Bharat / sports

సైనీ ఓ మంచి పేసర్​... భవిష్యత్​ స్టార్​: కోహ్లీ - Navdeep is from Delhi

ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్​తో జరిగిన తొలి టీ20 మ్యాచ్​లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న పేసర్​ నవదీప్ సైనీపై  ప్రశంసలు కురిపించాడు టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ. అరంగేట్రంలోనే 3 వికెట్లు సాధించి 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​' సొంతం చేసుకున్న ఈ యువ పేసర్ భారత్​కు భవిష్యత్​ స్టార్​ అని కితాబిచ్చాడు.

సైనీ ఓ మంచి పేసర్​... భవిష్యత్​ స్టార్​: కోహ్లీ

By

Published : Aug 4, 2019, 5:22 PM IST

విండీస్​తో ఫ్లోరిడాలో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు పేసర్‌ నవదీప్‌ సైనీ. శనివారం జరిగిన ఈ మ్యాచ్​లో 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా కరీబియన్ జట్టుపై భారత్​ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆట మొత్తం దాదాపు 140 కి.మీ వేగంతో పదునైన బంతులు వేశాడు సైనీ.

అంతర్జాతీయ టీ20లో అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శన చేశాడు సైనీ. నాలుగు ఓవర్ల స్పెల్​లో 19 డాట్​ బాల్స్​ వేశాడు. ఆఖరి ఓవర్​ను మెయిడిన్​గా ముగించడం విశేషం. భారత బౌలింగ్ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేసింది విండీస్ జట్టు​. సైనీ ప్రదర్శనకు ముగ్ధుడైన కోహ్లీ.. అతడిలో మంచి ప్రతిభ ఉందని మెచ్చుకున్నాడు.

"దేశవాళీలో దిల్లీ తరఫున ఆడిన నవదీప్​ సైనీ.. ఈ ఏడాది ఐపీఎల్​లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అతడిలో సూపర్​ టాలెంట్​ ఉంది. మంచి పేస్​ బౌలింగ్​తో ఆకట్టుకోగలడు. 150 కి.మీ వేగంతో బంతులేసినా అలసిపోకుండా చివరి వరకు పదునైన పేస్​తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలడు. తనలోని ప్రతిభ నిరూపించుకునే సమయం వచ్చింది. కచ్చితంగా ఇలాంటి ప్రదర్శనతో రాణిస్తే భవిష్యత్​లో భారత్​కు స్టార్​ అవుతాడు. ఇప్పటి నుంచే అందుకోసం ప్రయత్నిస్తాడని అనుకుంటున్నా".
-విరాట్​ కోహ్లీ, భారత జట్టు సారథి

తక్కువ లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్​మెన్లూ తడబడ్డారు. వాతావరణ పరిస్థితుల వల్ల మైదానం కాస్త ఇబ్బంది పెట్టినట్లు కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఫ్లోరిడాలోని సెంట్రల్​ బ్రోవార్డ్​ వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ ​ జరగనుంది.

ఇవీ చూడండి...'సైనీ.. నీ ప్రదర్శనతో వారికి బుద్ధి చెప్పావ్'

ABOUT THE AUTHOR

...view details