తెలంగాణ

telangana

ETV Bharat / sports

వికెట్ కీపర్ సాహాకు సర్జరీ.. బీసీసీఐ ప్రకటన

టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కుడిచేతి వేలికి గాయమైంది. సర్జరీ చేయించుకున్నాడని.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది.

Saha
సాహా

By

Published : Nov 27, 2019, 2:26 PM IST

బంగ్లాదేశ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, చికిత్స చేయించుకున్నాడు. కోల్​కతా వేదికగా జరిగిన డేనైట్ టెస్టులో ఈ క్రికెటర్ కుడి చేతివేలికి గాయమైందనిబీసీసీఐ తెలిపింది.

సాహా.. ఈ గాయానికి ముంబయిలోమంగళవారం శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కోలుకునే వరకు బెంగళూరూలోని జాతీయ క్రికెట్ అకాడమీలో విశ్రాంతి తీసుకోనున్నాడు.

సాహా.. 2018 ఐపీఎల్​లో భుజం గాయంతో జట్టుకు దూరమయ్యాడు. టీమిండియాలో చోటు దాదాపుగా కోల్పోయే స్థితికి చేరాడు. అప్పుడేసెలక్టర్లు.. ఇతడి స్థానంలో పంత్​కు అవకాశమిచ్చారు. 18 నెలల విరామం తర్వాత, దక్షిణాఫ్రికాతో సిరీస్​లో పంత్ వైఫల్యంతో తిరిగి జట్టులోకి వచ్చాడు సాహా.

దక్షిణాఫ్రికాతో సిరీస్​లో రాణించడం వల్ల బంగ్లాదేశ్​తో టెస్టు సిరీస్​కు సాహా ఎంపికయ్యాడు. కోల్​కతా వేదికగా జరిగిన చారిత్రక గులాబి టెస్టులో ఓ మైలురాయిని అందుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో 100 ఔట్లలో పాలుపంచుకున్న క్రికెటర్​గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ వికెట్​ కీపర్​గా రికార్డులకెక్కాడు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు టీమిండియాకు టెస్టు సిరీస్ లేదు. ఆ తర్వాతే న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టులు ఆడనుంది.​

ఇవీ చూడండి.. 'ద ఎండ్' అంటోన్న స్పీడ్ స్టార్ బుమ్రా

ABOUT THE AUTHOR

...view details