తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వారి గుర్తింపు కోసం నా పేరు చెడగొడుతున్నారు'

తమకు గుర్తింపు తెచ్చుకునేందుకు కొందరు వ్యక్తులు తన పేరు చెడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు పాక్ మాజీ బౌలర్ వసీమ్ అక్రమ్.

Wasim Akram
ఆమీర్​ సోహైల్ ,వసీం అక్రమ్

By

Published : May 8, 2020, 11:46 AM IST

వారికి గుర్తింపు తెచ్చుకునేందుకు కొందరు వ్యక్తులు, తన పేరును ఇప్పటికీ ఉపయోగిస్తున్నారని చెప్పాడు పాకిస్థాన్​ మాజీ పేసర్​​ వసీమ్ అక్రమ్​. తాను క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించి 17 ఏళ్లు అవుతున్నా, ఇంకా ఇలా చేయడం తనకు ఎంతో బాధగా ఉందని అన్నాడు. 1992 తర్వాత పాకిస్థాన్ ప్ర‌పంచక‌ప్ గెలవలేకపోవడానికి వ‌సీమ్ కార‌ణ‌మ‌ని ఆ దేశ మాజీ ఓపెన‌ర్ ఆమిర్​ సోహైల్ తాజాగా అన్న నేప‌థ్యంలో అక్ర‌మ్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు.

"కొంతమంది అనవసరంగా నా పేరు చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నాపై వస్తున్న ఈ తప్పుడు ఆరోపణలు వింటుంటే, మనసుకు బాధ కలుగుతోంది. నేను వారిని అలా అనగలను. కానీ దానివల్ల ఏం లాభం. దేశానికి ప్రాతినిధ్యం వహించడం వల్లే, వీడ్కోలు పలికి 17 ఏళ్లయినా ఈ గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి"

-వసీమ్ అక్రమ్​, పాక్​ మాజీ పేసర్

1992, 1996 ప్రపంచకప్​లలో పాక్​ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించడం సహా 2003 వరకు జట్టులో కొనసాగాడు అక్రమ్​.

ఇటీవల పాక్​ మాజీ పేసర్​ అతా ఉర్​ రెహ్మాన్​, మాజీ పీసీబీ చీఫ్​ ఖలీద్​ మహ్మద్​, తౌకిర్​ జియ్​ కూడా అక్రమ్​పై పలు ఆరోపణలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details