తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్​ రికార్డును కోహ్లీ తిరగరాస్తాడు: హాగ్ - సచిన్​ రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడు

క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ నెలకొల్పిన 100 సెంచరీల రికార్జును కోహ్లీ తిరగరాస్తాడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ బ్రాడ్​ హాగ్​ తెలిపాడు. ఇటీవలే తన యూట్యూబ్​ ఛానెల్​లో మాట్లాడిన హాగ్​.. ప్రపంచంలో అత్యుత్తమ బౌలింగ్​ టీమ్​ఇండియా సొంతమని వెల్లడించాడు.

Sachin's record of 100 centuries can be broken by Virat Kohli: Hogg
కోహ్లీ

By

Published : Jul 6, 2020, 10:02 AM IST

అంతర్జాతీయ క్రికెట్​లో మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్ తెందూల్కర్​​ 100 సెంచరీల రికార్డును విరాట్​ కోహ్లీ తిరగరాస్తాడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ బ్రాడ్​ హాగ్​ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే తన యూట్యూబ్​ ఛానెల్​లో మాట్లాడిన హాగ్​.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పలు విషయాలు పంచుకున్నాడు.

కోహ్లీ

"కోహ్లీ కచ్చితంగా సాధించగలడు. సచిన్​ కాలంతో పోలిస్తే.. ఇప్పుడున్న ఫిట్​నెస్​ సామర్థ్యాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ట్రైనర్స్ కూడా అలానే ఉన్నారు. చాలా మంది వైద్యులు కూడా ఉన్నారు. కాబట్టి ఆటగాళ్లు మ్యాచ్​లను కోల్పోయే అవకాశాలు తక్కువ. ఈ రోజుల్లో చాలా టోర్నీలు ఆడుతున్నారు. అందుకే కోహ్లీ కచ్చితంగా రికార్డు బద్దలు కొట్టగలడు."

-బ్రాడ్​ హాగ్​, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​

గతంలో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్​ఇండియా ప్రదర్శనను గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్​లో భారత బౌలర్లు అత్యుత్తమంగా ఉన్నట్లు హాగ్​ తెలిపాడు. "భారత పేసర్లు ఇతర జట్ల కంటే వేగంగా వికెట్లు పడగొట్టగలరు. ఇప్పటివరకు వారు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి ధీటైన జట్లతో తలపడ్డారు. అందుకే టీమ్​ఇండియా క్రికెట్​లో అత్యుత్తమంగా నిలుస్తోంది." అంటూ వెల్లడించాడు.

సచిన్​

తెందూల్కర్​ తన కెరీర్​లో 51 టెస్టు శతకాలు, 49 వన్డే సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సెంచరీలతో మొత్తం 70 అంతర్జాతీయ శతకాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ రికీ పాంటింగ్​ 71 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఇదీ చూడండి:'వార్నర్​ బ్యాట్ పడితే ఆ బాక్సర్​ గుర్తొస్తాడు'

ABOUT THE AUTHOR

...view details