తెలంగాణ

telangana

అప్పుడు తొలి వికెట్​గా సచిన్.. ఇప్పుడు రిటైర్మెంట్

By

Published : Dec 29, 2019, 12:45 PM IST

ఆస్ట్రేలియా స్టార్​ పేసర్​ పీటర్​ సిడిల్​.. అంతర్జాతీయ క్రికెట్​కు అనూహ్యంగా రిటైర్మెంట్​ ప్రకటించాడు. 11 ఏళ్ల​ కెరీర్​కు ఆదివారం గుడ్​బై చెప్పేశాడు. న్యూజిలాండ్​తో బాక్సింగ్​ డే టెస్టు ఆడుతున్న ఆసీస్​ జట్టులో ఇతడు సభ్యుడు. కాకపోతే తుదిజట్టులోకి ఎంపిక చేయలేదు.

Sachin wicket taker in opening match by Australia Team Pacer Peter Siddle has announced retirement from international cricket
సచిన్​ను ఔట్​ చేసిన 'సిడిల్​'... అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు

ఆస్ట్రేలియా సీనియర్​ పేసర్ పీటర్‌ సిడిల్‌... అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ఆసీస్​ తరఫున 11 ఏళ్లు ప్రాతినిధ్యం వహించిన ఈ బౌలర్... ఆదివారం తన రిటైర్మెంట్​ నిర్ణయాన్ని అనుహ్యంగా ప్రకటించాడు.

షాక్​లోసహచర క్రికటెర్లు

35 ఏళ్ల సిడిల్​.. అనూహ్యంగా వీడ్కోలు పలకడంపై సహచర క్రికెటర్లు షాకయ్యారు. ప్రతిష్టాత్మక మెల్​బోర్న్​ క్రికెట్​ మైదానం​లో న్యూజిలాండ్​తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఈ విషయం చెప్పాడు. ఇప్పటికే మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​కు ఎంపికైనా.. తుది జట్టులో మాత్రం ఇతడికి చోటు దక్కలేదు.

" రిటైర్మెంట్‌ తీసుకోవడానికి ఇదే తగిన సమయమని భావిస్తున్నా. ఆసీస్‌ జట్టుకు ఆడటాన్ని గొప్పగా భావిస్తున్నా. యాషెస్​లో ఆడాలన్న నా కోరిక తీరిపోయింది. కాస్త బాధతోనే క్రికెట్‌కు ముగింపు పలుకుతున్నాను"
-- పీటర్​ సిడిల్​, ఆస్ట్రేలియా క్రికెటర్​

సిడిల్ తొలి వికెట్ సచిన్​

2008లో క్రికెట్లో అరంగేట్రం చేసిన సిడిల్​... తొలివికెట్​గా దిగ్గజ​ సచిన్​ తెందూల్కర్​ను ఔట్ చేశాడు.​ తన టెస్టు కెరీర్​లో 67 మ్యాచ్​ల్లో 221 వికెట్లు తీశాడు. ఐదు వికెట్ల మార్కును ఎనిమిదిసార్లు అందుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్ల జాబితాలో 13వ స్థానంలో ఉన్నాడు.

20 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు సిడిల్​. కెరీర్​లో ఒక హ్యాట్రిక్​ ఉంది. ఆసీస్‌ తరఫున చివరగా యాషెస్‌ సిరీస్‌లో పాల్గొన్నాడు. దేశవాళీ క్రికెట్​, బిగ్​బాష్​ లీగ్​, ఇంగ్లీష్​ కౌంటీల్లో మాత్రం ఈ పేసర్ ఆడనున్నాడు.

ABOUT THE AUTHOR

...view details