తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్ x మెక్​గ్రాత్, సచిన్ x అక్తర్ ఎవరి మధ్య పోరు గ్రేట్! - Brad Hogg chooses his favourite rivalry

సచిన్-మెక్​గ్రాత్, సచిన్-అక్తర్ వీరిలో ఎవరి మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుందో తెలిపాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్.

Sachin
సచిన్

By

Published : Apr 5, 2020, 5:52 AM IST

Updated : Apr 5, 2020, 6:05 AM IST

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​.. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా పరుగులు సాధించడమే లక్ష్యంగా ఆడేవాడు. ఆ కాలంలో ఆస్ట్రేలియా బౌలర్ మెక్​గ్రాత్, పాకిస్థాన్ పేసర్ షోయబ్​ అక్తర్​తో సచిన్​కు గట్టి పోరు ఉండేది. ఆ దేశాలపై ఆడుతున్నప్పుడు ముఖ్యంగా వీరి మధ్య పోటీ గురించే అభిమానులు ఆత్రుతగా ఎదురుచూసేవారు. అయితే ఈ కాంబినేషన్​లో ఎవరు గ్రేట్ అనే విషయంపై తాజాగా స్పందించాడు ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్.

సచిన్-మెక్​గ్రాత్ మధ్య పోరులో ఎప్పుడూ మెక్​గ్రాత్ గెలిచేందుకు ప్రయత్నించేవాడని.. వీరి మధ్య పోరంటే ఎప్పుడూ ఆసక్తికరంగా ఉండేదని తెలిపాడు హాగ్.

మెక్​గ్రాత్ 563 మ్యాచ్​లు ఆడి 381 వికెట్లు సాధించాడు. అందులో 13 సార్లు సచిన్​ను ఔట్ చేశాడు.

అలాగే షోయబ్ అక్తర్​ ఎప్పుడూ తన వేగంతో సచిన్​కు పరీక్ష పెట్టేవాడని తెలిపాడు హాగ్. దీంతో పాటు భారత్​-పాకిస్థాన్ మ్యాచ్ అంటే మరింత ఉత్కంఠ ఉండేదని అన్నాడు.

అక్తర్ తన కెరీర్​లో వన్డేల్లో 178, టెస్టుల్లో 247 వికెట్లు సాధించాడు. సచిన్​ను ఎనిమిది సార్లు ఔట్ చేశాడు.

Last Updated : Apr 5, 2020, 6:05 AM IST

ABOUT THE AUTHOR

...view details