తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిగ్గజ క్రికెటర్ సచిన్​కు కరోనా పాజిటివ్​ - సచిన్ కొవిడ్ 19 పాజిటివ్

Sachin Tested corona positive
సచిన్​కు కరోనా

By

Published : Mar 27, 2021, 10:22 AM IST

Updated : Mar 27, 2021, 10:49 AM IST

10:20 March 27

టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్​గా వచ్చినట్లు వెల్లడించారు.

"కరోనాను దూరంగా ఉంచడానికి తగిన జాగ్రత్తలతో పాటు స్వయంగా టెస్టు చేసుకున్నాను. ఏది ఏమైనప్పటికీ ఈరోజు నాకు కరోనా పాజిటివ్​గా తేలింది. మిగితా కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్​ ఫలితం వచ్చింది. నేను ఇంట్లోనే డాక్టర్ల సూచనలు పాటిస్తూ క్వారంటైన్​లో ఉన్నాను. నాకు సాయం చేసిన నా డాక్టర్లు, దేశంలోని ఆరోగ్య సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు. అందరూ జాగ్రత్తగా ఉండండి."  

                    -సచిన్ తెందూల్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్

సచిన్ ఇటీవలే రోడ్ సేఫ్టీ సిరీస్​లో పాల్గొన్నాడు. ఈ సిరీస్​లో ఫైనల్లో శ్రీలంక లెజండ్స్​పై గెలిచిన ఇండియా  లెజెండ్స్ విజేతగా నిలిచింది. 

Last Updated : Mar 27, 2021, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details