తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్​ సెంచరీ చేజారడం బాధించింది: అక్తర్

2003 ప్రపంచకప్​లో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​ రెండు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. ఆ సందర్భంలో తను చాలా బాధపడ్డట్లు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెలిపాడు.

సచిన్
సచిన్

By

Published : May 20, 2020, 11:10 AM IST

భారత్​-పాకిస్థాన్ మ్యాచ్​ అంటే ఆ ఉత్కంఠే వేరు. ఆ సమయంలో భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. ప్రత్యర్థి ఆటగాళ్లు రాణించకూడదని, ఓడిపోవాలనే అందరూ కోరుకుంటారు. అయితే ఓ మ్యాచ్​లో పాక్ మాజీ పేసర్ అక్తర్ మాత్రం సచిన్​ సెంచరీ మిస్​ అవడం పట్ల బాధపడ్డాడట.

"2003 ప్రపంచకప్‌లో మాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ 98 పరుగుల వద్ద ఔటవ్వడం బాధించింది. అది చాలా ప్రత్యేక ఇన్నింగ్స్‌. అతడు శతకం చేయాల్సింది. అతడు శతకం చేస్తే చూడాలనుకున్నా. నేను సంధించిన బౌన్సర్‌కు ఔటవ్వకుండా సిక్సర్‌ బాదితే బాగుండేది"

-షోయబ్ అక్తర్, పాక్ మాజీ పేసర్

సెంచూరియన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ తొలుత 273/7 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన భారత్‌కు సచిన్‌, సెహ్వాగ్‌ మెరుపు ఆరంభాన్నిచ్చారు. మాస్టర్‌ 75 బంతుల్లోనే 98 పరుగులు చేశాడు. 12 బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదేశాడు. ఆ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ (44), యువరాజ్‌ సింగ్‌ అర్ధశతకం చేయడం వల్ల టీమ్‌ఇండియా మ్యాచ్‌ గెలిచింది.

ABOUT THE AUTHOR

...view details