భారతదేశానికి క్రికెట్‌లో తొలి ప్రపంచ కప్ అందించిన మాజీ సారథి కపిల్‌దేవ్ ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశామని, కపిల్ ఆరోగ్యం నిలకడగానే ఉందని దిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న కపిల్ రెండు మూడు రోజుల్లో ఇంటికి వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ పాజీ(అన్న) త్వరగా కోలుకోవాలని ఆయన సహచరులు, క్రీడాకారులు ప్రార్థిస్తున్నారు. తమ ఆకాంక్షలను వారు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విధంగా వెల్లడించారు.
"టేక్ కేర్ కపిల్‌దేవ్! మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గెట్‌వెల్ సూన్ పాజీ!"
-సచిన్ తెందూల్కర్
"మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గెట్ వెల్ సూన్ పాజీ."
-విరాట్ కోహ్లీ
"మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను కపిల్ సర్.. టేక్ కేర్, గాడ్ బ్లెస్.."
-సురేశ్ రైనా
"మీరు త్వరగా కోలుకోవాలి కపిల్ సర్. ఎప్పుడూ శక్తిమంతంగా ఉండాలి."
-శిఖర్ ధావన్
"యాంజియోప్లాస్టీ అనంతరం గ్రేట్ కపిల్‌దేవ్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. పాజీ, మీరెప్పుడూ ఫైటర్ గానే ఉన్నారు. ఈ పరిస్థితితో కూడా ఫైట్ చేసి బయటకు వస్తారు."
-మహమ్మద్ కైఫ్