సచిన్ తెందూల్కర్.. తన క్రికెట్ నైపుణ్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. లాక్డౌన్ సమయంలో సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోనే ఉంటున్నాడు. తనకు సంబంధించిన ప్రతి వీడియోను షేర్ చేసుకుంటున్నాడు. ఇటీవల తనే సొంతంగా హెయిర్ కట్ చేసుకున్న మాస్టర్.. మరోసారి కత్తెర చేతపట్టాడు. కానీ ఈసారి తనయుడు అర్జున్ కోసం.
'ఓ తండ్రిగా ఏదైనా చేయాల్సిందే'.. తనయుడికి సచిన్ హెయిర్‌కట్ - సచిన్ తెందూల్కర్ హెయిర్‌కట్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ తాజాగా ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో అతడి తనయుడు అర్జున్‌కు హెయిర్ కట్ చేస్తూ కనిపించాడు సచిన్.
సచిన్ తన తనయుడు అర్జున్‌కు హెయిర్‌కట్ చేస్తోన్న వీడియోను తాజాగా నెట్టింట పంచుకున్నాడు. "ఓ తండ్రిగా ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది. వారితో ఆటలు ఆడుకోవడం, జిమ్‌లో సహాయపడటం, అందులో భాగంగా వారికి హెయిర్ కట్ చేయడం. మొత్తానికి హెయిర్ కట్ బాగా కుదిరింది. అర్జున్ నీవెపుడు అందంగానే ఉంటావు. నాకు సహాయపడిన సారాకు కృతజ్ఞతలు" అంటూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు మాస్టర్.
ఇంతకుముందు టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మతో హెయిర్ కట్ చేయించుకున్నాడు. తాజాగా మరో ఆటగాడు పుజారా కూడా భార్య చేత జుత్తు కత్తిరించుకున్నాడు.