కరోనా(కొవిడ్-19)ను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్టు 21 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. తాను ఇంట్లోనే ఉంటున్నట్లు చెప్పిన మాస్టర్.. ఓ వీడియోను ట్వీట్ చేశాడు. ప్రభుత్వం, వైద్య సిబ్బంది ఎంతచెప్పినా చాలా మంది వారి మాట వినడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. తన కుటుంబంతో పాటే తానూ 21 రోజులు ఇంట్లోనే ఉంటున్నామన్న సచిన్.. ప్రజలూ ఎవరింట్లో వారే ఉండాలని కోరాడు.
అంతకముందే మరో ట్వీట్
చిన్న చిన్న విషయాలు పాటించడం చాలా కష్టమని, అలా చేయాలంటే స్థిరమైన క్రమశిక్షణతో పాటు సంకల్పబలం అవసరమని మరో ట్వీట్ చేశాడు సచిన్. ప్రధాని చెప్పినట్లు చేస్తే లక్షలమంది జీవితాలు కాపాడొచ్చని అన్నాడు. కొవిడ్-19పై యుద్ధం చేసేందుకు అందరం కలిసికట్టుగా ఉందామని చెప్పాడు.
గంగూలీ సూచనలు