భారత క్రికెట్లో నయావాల్ ఛెతేశ్వర్ పుజారా నేడు 32వ జన్మదిన వేడుకలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు మాజీలు, సహచర క్రికెటర్లు అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ స్టార్ ప్లేయర్ బర్త్‌డే సందర్భంగా దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్ కూడా విషెస్ చెప్పాడు. గుజరాతీ భాషలో పుజారాను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు.
"పుజారాను ఔట్ చేయాలంటే పూజారి ఆశీర్వాదాలు కావాలి. హ్యాపీ బర్త్‌డే పుజారా" అని మాస్టర్ బ్లాస్టర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. పుజారా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ఆటగాడు కావడం వల్ల ఈ భాషలోనే ట్వీట్ చేశాడు సచిన్.