తెలంగాణ

telangana

ETV Bharat / sports

అందుకే డీఆర్​ఎస్​ను వ్యతిరేకించాం: సచిన్

సమీక్ష విధానంపై టీమ్​ఇండియా మొదటి నుంచి అసంతృప్తితోనే ఉంది. అయినా ఈ పద్ధతిని మొట్టమొదట ఉపయోగించుకుంది భారత జట్టే. అప్పుడు టీమ్​లో ఉన్న దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్ డీఆర్​ఎస్​ను వ్యతిరేకించడానికి గల కారణాన్ని వెల్లడించాడు.​

Sachin Tendulkar
అందుకే డీఆర్​ఎస్​ను వ్యతిరేకించాం: సచిన్

By

Published : Sep 25, 2020, 6:29 AM IST

నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్‌ఎస్‌) అంటే ఆరంభంలో భారత్‌కు సదాభిప్రాయం లేదు. కానీ సమీక్షను మొట్టమొదట ఉపయోగించుకుంది టీమ్‌ఇండియానే. 2008లో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో డీఆర్‌ఎస్‌ అమలు చేశారు. కానీ ఈ పద్ధతి అంత కచ్చితంగా లేదని ఆనాటి జట్టు బీసీసీఐకి తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ విధానాన్ని వ్యతిరేకించడం వెనుక కారణాన్ని ఆ సిరీస్‌లో ఆడిన దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందూల్కర్‌ వెల్లడించాడు.

"2008లో శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు అంపైర్‌ నిర్ణయ సమీక్ష విధానాన్ని అమలు చేశారు. అప్పటి జట్టులో నాతో పాటు ద్రవిడ్‌, గంగూలీ, లక్ష్మణ్‌, జహీర్‌, హర్భజన్‌ లాంటి సీనియర్లు ఉన్నారు. ఆ సిరీస్‌లో దాదాపు 15 నిర్ణయాలను థర్డ్‌ అంపైర్‌కు నివేదిస్తే.. మాకు అనుకూలంగా ఒకే ఒక్కటి వచ్చింది. మేం ఎల్బీలను సరిగా అంచనా వేయలేకపోయామా.. లేదా సమీక్షను వాడుకోవడం రాలేదో అర్థం కాలేదు. అందుకే డీఆర్‌ఎస్‌లో ఏదో లోపం ఉందని భావించాం. బీసీసీఐకి మా అసంతృప్తిని తెలియజేశాం. ఆ తర్వాత సమీక్షలో ఎన్నో మార్పు చేర్పులు జరిగాయి."

-సచిన్ తెందూల్కర్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

కెరీర్‌లో ఎన్నో సందేహాస్పద నిర్ణయాలకు ఔటైన సచిన్‌.. ఇటీవల డీఆర్‌ఎస్‌లో అంపైర్‌ కాల్‌తో విభేదించాడు. ఎల్బీని నిర్ణయించేందుకు బంతి స్టంప్‌కు 50 శాతానికిపైగా తగలాలన్న నిబంధనను తీసేయాలని అతను చెప్పాడు. బంతి కొద్దిగా తాకినా బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గా ప్రకటించాలన్నాడు.

ABOUT THE AUTHOR

...view details