తాను ఎదుర్కొన్న అత్యుత్తమ అయిదురు ఆల్‌రౌండర్లను దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ప్రకటించాడు. "ప్రపంచ టాప్-5 ఆల్‌రౌండర్లను చూస్తూ పెరిగాను. వారిలో కపిల్‌దేవ్ ఒకరు. అతడితో కలిసి ఆడాను. రెండో వ్యక్తి ఇమ్రాన్ ఖాన్. పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు అతడిని ఎదుర్కొన్నాను. మూడో ఆల్‌రౌండర్ సర్ రిచర్డ్ హాడ్లీ. రెండోసారి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు అతడితో ఆడాను. అలాగే ఆస్ట్రేలియాలో టోర్నీ సందర్భంగా విండీస్ ఆటగాడు మాల్కమ్ మార్షల్, ఇంగ్లాండ్ క్రీడాకారుడు ఇయాన్ బోథమ్‌ను ఎదుర్కొన్నాను. వాళ్లంతా నా అత్యుత్తమ ఆల్‌రౌండర్లు. వారిని చూస్తూ పెరిగాను. అంతేకాక వారితో కలిసి ఆడే అవకాశమూ దక్కింది" అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సచిన్ తెలిపాడు.
అత్యుత్తమ ఆల్‌రౌండర్లు వాళ్లే: సచిన్ - సచిన్ 5 ఆల్‌రౌండర్లు
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్.. తన కెరీర్లో ఎదుర్కొన్న అత్యుత్తమ ఆల్‌రౌండర్ల పేర్లను తాజాగా వెల్లడించాడు. అయిదుగురి పేర్లను ప్రసావిస్తూ.. వారిని చూస్తూ పెరిగానని అన్నాడు. మరోవైపు సచిన్ పుట్టినరోజు సందర్భంగా అతని కెరీర్లో ఉత్తమ ప్రదర్శన ఏదని ఐసీసీ ఓ పోల్ నిర్వహించగా.. నెటిజన్లు స్పందించారు.
సచిన్.. శుక్రవారం 47వ వసంతంలోకి అడుగుపెట్టాడు. అయితే ఈ సందర్భంగా ఐసీసీ సచిన్ అత్యుత్తమ ఇన్నింగ్స్ తెలపాలని నెటిజన్లకు ఓ పోల్ నిర్వహించింది. దీనిలో 1998లో షార్జా వేదికగా ఆసీస్‌పై సాధించిన ఇన్నింగ్స్‌ను నెటిజన్లు ఎంపిక చేశారు. ఆ మ్యాచ్‌లో సచిన్ 131 బంతుల్లో 143 పరుగులు సాధించాడు. 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అయితే ఇసుక తుపాను మ్యాచ్‌కు ఆటంకం కలగడం వల్ల లక్ష్యాన్ని 46 ఓవర్లలో 277 పరుగులుగా నిర్ణయించారు. కానీ భారత్ 26 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇదీ చూడండి.. 'క్రికెట్ కంటే భావితరాల చదువు ముఖ్యం'