క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్.. తన పిల్లల పేరు మీద సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఖాతాలన్నీ నకిలీవేనని అన్నాడు. వాటిపై చర్యలు తీసుకోవాలని మైక్రో బ్లాగింగ్ సైట్‌ను కోరాడు.
"నా కూతురు సారాకు, కుమారుడు అర్జున్‌కు గానీ ట్విట్టర్లో ఎటువంటి ఖాతాలు లేవు. వారి పేరు మీద ఖాతాలను నడుపుతూ అందులో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. @జూనియర్- తెందూల్కర్ పేరు మీద ఎవరో అర్జున్‌లాగా ఖాతా తెరిచారు. అందులో వ్యక్తులకు, సంస్థలకు వ్యతిరేకంగా హానికరమైన ట్వీట్లను పోస్ట్ చేస్తున్నారు. ఈ ఖాతాలో 'లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్'అని పూర్తి వివరంగా ఉంది. వాటిని అన్నింటిని వెంటనే తొలగించాలి" -సచిన్ తెందూల్కర్